క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 10

క్రిస్మస్ శుభవార్త

1 తిమోతి 2: 5 చదవండి.
క్రిస్మస్ యొక్క ఉద్దేశ్యమంతా శుభవార్త గురించి. కానీ అది ప్రత్యేక బహుమతులు యొక్క శుభవార్త కాదు. ఇంకా ఇది ఒక పెద్ద భోజనం గురించిన మంచి వార్త కాదు. అలానే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడిపెడి మంచి వార్త కూడా కానే కాదు.

క్రిస్మస్ యొక్క పరమోద్దేశ్యం దేవుని ప్రేమ యొక్క సువార్త గురించి.

బైబిలు లో చెప్పబడిన ప్రకారం, దేవుడు లేకుంటే మనమంతా నశించినట్టి వారము. మనము దిశా నిర్దేశ్యము లేనట్టి వారం. మనము రక్షణ లేకుండానే ఉన్నాము. ప్రపంచము పై శాశ్వతమైన ప్రభావమును నిర్దారించలేము. మనము నిజమైన ఆనందం లేకుండా ఉన్నాము. పరలోకంలో మన శాశ్వతత్వం సురక్షితం కాదు.

క్రిస్మస్ ను గురించిన శుభవార్త యేదనగా, దేవుడు యేసును పంపించి, నశించిపోయిన వారిని వెదుకుతూ, రక్షించుకోవటమే. బైబిలు ఇలా చెబుతోంది, "ఒకే దేవుడు మాత్రమే ఉన్నాడు, క్రీస్తుయేసు మాత్రమే దేవుని చెంతకు మనల్ని తీసుకువెళ్లగలిగే మధ్యవర్తి. యేసు నిజంగా మనుష్యుడై యున్నాడు, మరియు మనమంతా కాపాడబడునట్లు తనను తానే సమర్పించుకున్నాడు "(1 తిమోతి 2: 5).

మీరు ఎప్పుడైనా చర్చి లో సమయం గడిపి ఉంటే, మీకు "రక్షణ" అనే పదం అనేక సార్లు వినే అవకాశం ఉంది. కానీ ఆ పదము యొక్క అర్థం ఏమిటో మీకు తెలియకపోవచ్చు.ఆ పదం ఒక వజ్రం లాంటిది; మీరు దానిని అనేక కోణాల నుండి చూడవచ్చు మరి ప్రతీ కోణము మరింత ప్రత్యేకముగా ఉంటుంది.

• యేసు మనలను రక్షించుటకు వచ్చాడు. మన సమస్యలన్నిటినీ మనము స్వంతముగా పరిష్కరించలేము. యేసు లేకుండా, మనము ఇతరుల అంచనాలలో చిక్కుకున్నాము. మనము మన తోటివారి మెప్పు పొందటమనే జీవనశైలిలో చిక్కుకున్నాము. మనము బంధనాలలో చిక్కుకున్నాము. మనము మళ్ళీ మళ్లీ మారుటకు ప్రయత్నించాము, కానీ తప్పించుకోవడానికి అవసరమైన శక్తి మనకు లేదు. యేసు మనకు ఆ శక్తిని ఇచ్చుటకు వచ్చాడు.

• యేసు మనలను వెతుకుటకు వచ్చాడు. మన జీవితాలలో పోగొట్టుకున్న వాటిని తిరిగి దక్కించుకోవాలని మనమంతా కోరుకొంటాము. క్రీస్తు లేకుండానే మనము ఎన్నో చేయాలని అనుకుంటాము, కోల్పోయిన మన బలమును, మన ఆత్మ స్తైర్యమును, మన ప్రతిష్టను, మన అమాయకత్వమును మరియు దేవునితో మనకున్న సంబంధాన్ని. యేసు ద్వారా మాత్రమే మనము వాటన్నిటిని తిరిగి పొందగలము.

• యేసు మనలను తిరిగి కలుసుకోవడానికి వచ్చాడు. చాలామంది దేవుని వద్దకు తిరిగి వచ్చినట్లయితే ఆయన వారిని గద్దిస్తాడు అని భావిస్తారు. కానీ దేవుడు మీ పై కోపముతో లేడు. అతను మీ గురించి అత్యంత ప్రేమ కలిగి యున్నాడు. దేవునితో మళ్ళీ మనకు సామరస్యతను ఇవ్వాలని మొదటి క్రిస్మస్ రోజున యేసు మనకు దేవునితో సంబంధమును పునరుద్దరించటానికి భూమికి వచ్చాడు.

యేసు తననే మనకు బహుమతిగా ఇవ్వడానికి భూమికి వచ్చాడు. రక్షణ అనే ఈ ఉచిత బహుమతిని అంగీకరించకుండా మనలో చాలామంది అతని పుట్టినరోజును జరుపుకుంటారు. సంవత్సరానికి తర్వాత సంవత్సరం బహుమతి పై చుట్టిన కాగితమును విప్పకుండానే సంవత్సరం గడచిపోతుంది. ఇది తెలివితనము కానే కాదు! మీరు దేవుని చేత దేవుని కొరకు సృష్టించబడ్డారు. ఇది మీకు అర్థం అగు వరకు, జీవితం ఎప్పుడూ అర్ధవంతం కాలేదు.

ఈ క్రిస్మస్ దినమున, మీకు ఇవ్వబడిన అత్యంత ముఖ్యమైన బహుమతి పై చుట్టిన కాగితమును విప్పి మీ స్వంతము చేసుకోండి: యేసు ద్వారా దేవునీతో ఒక కొత్త సంబంధం ఏర్పరచుకొందాము.

వాక్యము

Day 9

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.