క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 2

యేసుతో ప్రయాణము యోగ్యమైనది

మత్తయి 2: 1 చదవండి.

సత్యాన్ని శోదించటమనేది ఒక పాక్షిక సమయ ఉద్యోగం కాదు. ఇది మీకు కలిగిన ప్రతిదీ మీ నుండి తీసుకుంటుంది. జ్ఞానులు క్రిస్మస్ కథలో ఇది మీకు బోధిస్తారు.

జ్ఞానులు నిజం కనుగొనేందుకు దేనికైనా సిద్ధపడ్డారు. మత్తయి 2: 1 ఇలా చెబుతోంది, "యేసు పుట్టాక, తూర్పు నుండి కొంతమంది జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు" (NCV). జ్ఞానులు యేసును కనుగొనడానికి దూర ప్రాచ్యం నుండి మధ్యదరా ప్రాంతము వరకు అనేక మైళ్ళ దూరం ప్రయాణించినట్లు మనము నిర్ణయించవచ్చు.

యేసు బెత్లెహెం యందు జన్మించాడు, ఇది జెరూసలేం నుండి కేవలం ఆరు మైళ్ళ. యేసు జన్మించిన సమయమందు యెరూషలేము ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రముగా ప్రసిద్దిపొందింది. యెరూషలేములో అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రధాన మత నాయకులు యెరూషలేములో ఉన్నారు, కానీ వారిలో ఏ ఒక్కరూ యేసును వెదకలేదు. వెలుపల ప్రజలు మాత్రమే -పూర్తిగా వేరే సంస్కృతి నుండి వచ్చిన జ్ఞానులు యేసు కోసం వెదకుచున్నారు.

హేరోదు రాజు శిశువైన యేసును గుర్తించలేకపోయాడు. అదే విధంగా బేత్లెహేము యొక్క వ్యాపార నాయకులు కూడా గుర్తించలేకపోయారు. మీరు కూడా మీ మధ్యలో యేసు ఉన్నప్పటికినీ మీరు అతన్ని వెదకకపోతే అతన్ని గుర్తించలేకపోవచ్చు.

కానీ జ్ఞానులు యేసు కోసం చూశారు. యేసును కనుగొనేలా ఒక మండుచున్న ఎడారిలో నాలుగు నుండి అయిదు నెలల యాత్ర చేయటానికి వారు ఇష్టపడ్డారు. వారు దేవుణ్ణి వెతకటం గురించి కృత నిశ్చయముతో ఉన్నారు. వారు అతనిని ఏ విధంగానైనా కనుగొనేందుకు సిద్దపడి ఉన్నారు.

అది జ్ఞానముతో కూడిన పని. ఇది మేము ఎలాగైనా చేయాలి. దేవుని కోసం మన అన్వేషణలో మన దారిలోకి ఏది అడ్డురాకూడదు. ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఘనకార్యం.

యేసు, పరలోక రాజ్యము ఒక అత్యంత విలువైన ముత్యం వంటిది దానిని పొందుటకు మన వద్ద ఉన్న విలువైన అన్నిటిని అమ్మి దానిని పొందుతాము అని చెప్పారు. యేసు ఈ ఉపమానాన్ని మాట్లాడకముందే తూర్పు నుండి జ్ఞానులు ఈ విషయాన్ని చాలా ముందుగా అర్థం చేసుకున్నారు.

జ్ఞానులు యేసును ఆరాధించుటకు వారి వద్దనున్న సమస్తమును ఇచ్చుటకు సిద్దపడినారు. వారు తమ గృహాల సుఖాలు వదిలి, కఠినమైన సుదీర్ఘమైన ప్రయాణము కోసము సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే వారు యేసును శోధించుటకు సరైన ఉద్దేశ్యము కలిగి యున్నారు. వారు ఆయనను ఆరాధించాలని కోరుకున్నారు.

యేసును పూజించుట కొరకు మీరు దేనిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు?

వాక్యము

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.