క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 1

జ్ఞానులు కొరకు వాక్యము

నేటి వచనములను చదవండి.

యేసు యొక్క జనన దృశ్యం చూడండి, మరియు బహుశా పశువుల కొట్టంలో ఉండుటకు ఊహ కందని పాత్రల గుంపును మీరు చూడవచ్చు: జ్ఞానులు. మనము వారిని చూచుటకు అలవాటు పడినాము, కానీ మీరు సన్నివేశాన్ని దగ్గరగా చూస్తే, వారు వారి తళుకుగల బట్టలు మరియు ప్రత్యేక బహుమతులుతో ఆ పశువుల కొట్టంలో ఉండటం మనకు అసంబద్ధంగా కనిపిస్తుంది.

కానీ నాకు, వారు క్రిస్మస్ కథలో అత్యంత ఆకర్షణీయ వ్యక్తులు. వారిని గురించి మనకు ఎక్కువ తెలియదు. వారు ఎవరో, లేదా వారు ఎక్కడి వారో మనకు తెలియదు. బైబిలు వారిని "జ్ఞానులు" అని పిలుస్తుంది. తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు మరియు ఖగోళ శాస్త్రవేత్తల కలయిక జ్ఞానులు. వారు చాలా సంపన్నమైనవారు మరియు విద్యావంతులుగా ఉన్నారు. కానీ వారిని గురించి మనకు అంత మాత్రమే తెలుసు.

కానీ వారు జ్ఞానవంతులని మనకు తెలుసు. నిజానికి, వారు క్రిస్మస్ కథలో ప్రదర్శించే జ్ఞానం నుండి చాలా నేర్చుకోవచ్చు.

జ్ఞానుల నుండి నేర్చుకొనే ఇతర పాఠాలు అవి, సత్యమును ఆకాంక్షించేవారు అని నేర్చుకోవచ్చు. జ్ఞానులు ఊహలు లేదా ఊహాగానాలతో సంతోషంగా లేరు. వారు దేవుని గురించి సత్యాన్ని, తమ గతం, వారి భవిష్యత్తు గురించిన తెలుసుకోవాలనుకుంటారు. "యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ?" అని జ్ఞానులులో కొందరు అడిగారు. (మత్తయి 2: 2 ఆ NCV)

జ్ఞానులు యేసును వెదకుకున్నారు. జ్ఞానమైన పురుషులు మరియు మహిళలు ఇప్పటికీ అతన్ని నేడు కోరుకుంటారు.

సత్యమును బట్టి జీవితంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు: ఊహించెడివారు మరియు శోధించెడివారు. ఊహించెడివారు సత్యమును గురించి ఊహిస్తారు. ఊహించెడివారు దేవుడి ఫలానా విధంగా ఉంటాడు కావచ్చు అని ఆలోచిస్తారు.

ఊహించెడివారు దేవుడిని బట్టి వాదించడానికి మరియు చర్చించడానికి ఇష్టపడతారు, కానీ అవి కేవలం ఊహించడం - వారు నిజంగా నిజం తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదు. వారు కేవలం అతని గురించి మాట్లాడాలనుకుంటున్నారు.

మరోవైపు, సత్యాన్ని కనుగొనేందుకు సమయాన్ని వెచ్చిస్తున్న వారిని దేవుడు ప్రేమిస్తాడు. శోధించెడివారు నాలుగు పనులు చేస్తారు:
• వారు ప్రశ్నిస్తారు.
• వారు అధ్యయనము చేస్తారు.
• వారి చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తారు.
• సమాధానాలను కనుగొనడానికి వారు వెనకడుగు వేయరు.

యేసును వెదకుటకు వారు తమ పూర్ణ శక్తితో శోధిస్తారు. శోధించెడివారిని దేవుడు ప్రేమిస్తాడు. బైబిల్ మనకు చెబుతుంది, "కానీ అక్కడ నుండి మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెతికితే ఆయనను కనుగొంటారు" (ద్వితీయోపదేశకాండము 4:29 NIV).

మీరు నిజం తెలుసుకొనుట గురించి నిజాయితీగా పట్టుదలగా ఉంటే, మీరు దానిని తప్పకుండ తెలుసుకొంటారు.

దేవుడు మిమ్మల్ని నిరుత్సాహము పడనీయదు.
రోజు 2

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.