క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 9

నశించి పోవుట వలన ఏమవుతుంది

నేటి వచనములు చదువండి

మీరు క్రిస్మస్ యొక్క పరమార్థమును అర్థం చేసికొనలేకపోతే, మీరు క్రిస్మస్ దీపాలు వెలిగించాన్ని మానుకోవచ్చు మరియు ఈ సంవత్సరం అలంకరణలు చేయటాన్ని మానుకోవచ్చు. అలాగే క్రిస్మస్ బహుమతులను కొనడం గురించి మర్చిపోవచ్చు. ఇంకా మీరు క్రిస్మస్ విందు కూడా మర్చిపోవచ్చు.

మీరు ఎందుకు క్రిస్మస్ని జరుపుకున్నారో మీకు తెలియకపోతే, అన్ని పండగ ఉత్సవాలకు అర్ధం లేదు.

క్రిస్మస్ ప్రయోజనం కనుగొనడానికి, మీరు పశువుల తొట్టిని, జ్ఞానులను మరియు మందకాపరులను దాటి ఇంకా వేగంగా ముందుకు వెళ్ళాలి. యేసు మనకు మొదటి క్రిస్మస్ నాడు అతను భూమికి వచ్చిన కారణాన్ని చెప్పాడు: "మనుష్యకుమారుడు నశించి పోయినవారిని కనుగొని వారిని కాపాడుటకు వచ్చాడు" (లూకా 19:10).

సామాన్య పదాలలో, యేసు వచ్చింది ఎందుకంటే దేవుడు లేకుండా ప్రజలు నశించిపోయిన వారుగా ఉన్నారు. ఆధ్యాత్మికంగా నశించిపోవటం అంటే దేవుని నుండి వేరు చేయబడటం, విడదీయబడటం, మరియు త్రోసివేయబడటం. యేసు లేకుండా, ప్రపంచంలోని అందరూ నశించిపోతారు - ఎంత శక్తి, సంపద, లేదా కీర్తి కలిగి ఉన్నా.

మనము నశించిపోవటం వలన ఎన్నో పర్యవసానాలు మన జీవితాల్లో కలిగి ఉన్నాయి. యేసు భూమికి ఎందుకు వచ్చాడో తెలుసుకునేందుకు, నశించిపోవటం యొక్క అర్థం ఏమిటో అర్థం చేసుకోవాలి. దేవుడు లేకుండా, మనము నశించిపోయాము:

• మన దిశ. మనము ఎక్కడికి వెళ్ళాలి మరియు ఈ జీవితంలో మనం ఏమి చేయాలి అనేదానికి తక్కువ అవగాహన కలిగివున్నాము.
• అతని రక్షణ. మనము దేవుని యొక్క రక్షణలో లేనప్పుడు మనము మనపైనే ఆధారపడియున్నాము. ఇది చాలామంది ప్రజలు ఆందులోనచెందటానికి భారీ కారణం. వారు దేవుని రక్షణకు బదులుగా వారి స్వంత సంరక్షణలో మరియు రక్షణలో జీవిస్తున్నారు.
• మన సామర్థ్యము. మనము దేవునితో సన్నిహిత సంబంధాల్లో లేకుంటే సగం ప్రజ్ఞ మరియు ప్రతిభ మనకు ఎప్పటికీ తెలియదు.
• మన ఆనందం. మనము ప్రపంచంలోని చాలా డబ్బు మరియు అధికారం కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు లేకుండా మనకు నిజమైన ఆనందం ఉండదు.
• పరలోకమందు మన ఇల్లు. మనము భూమిపై ఉన్నప్పుడే దేవుడు తిరుగుబాటు చేయుటకు అనుమతిస్తాడు, కాని పరలోకంలో ఏ తిరుగుబాటు లేదు.

కానీ నశించిపోయినవాడు ఎవరైనా దేవుని యందు ఎలాంటి విలువను కూడా కోల్పోడు. మీరు ఆయనతో సంబంధము కలిగి లేకున్నప్పటికిని, దేవుని యందు నీవు ఎంతో విలువ కలిగి యున్నావు. నశించిపోవటమనేది ఒక విలువను సూచిస్తుంది. కోల్పోయిన దానిని తిరిగి పొందటానికి ఎంత ఖర్చు చేయడానికి ఎవరైనా సిద్ధమయ్యారు అనే అంశం కోల్పోయిన దాని విలువ ఎంత విలువైనదో చూపిస్తుంది.

బైబిల్ లో అత్యంత ప్రసిద్ధ వచనములో, యేసు సుస్పష్టంగా మన విలువను వివరించాడు: "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను" (జాన్ 3: 16).

మంచి వర్తమానము ఏదనగా, దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు, నశించి పోతున్న మనలను అన్వేషించి రక్షించటానికి ఆయన తన కుమారుని భూమికి మొదటి క్రిస్మస్ దినమున పంపించాడు. ఇది క్రిస్మస్ వేడుక జరుపుకోవడానికి గల కారణం!
రోజు 8రోజు 10

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.