క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 6

ఈ క్రిస్మస్ లో యేసు గొంతు విందాము

లూకా 10: 41-42 చదవండి.

మీరు మరియు నేను మన జీవితాలను విశ్రాంతి లేకుండా గడుపుతున్నాము. మనము సమయము సరిపోని ఎన్నో పనులు చేయడానికి, అసాధారణంగా డబ్బు ఖర్చు పెట్టడానికి, అతిగా అంచనా వేయడం, మరియు మనము తరచుగా తిరిగి అన్ని సమయాలలో అలసిపోతుంటాము. తత్ఫలితంగా, దేవుని సత్యం తరచూ మన జీవితాల్లో వికసించటానికి అవకాశం లేకుండాపోతుంది.

చాలా తరచుగా దేవుడు నీకు సత్యం యొక్క సారాంశాన్ని బోధిస్తాడు - బహుశా మీ ఉదయం బైబిల్ అధ్యయనం లేదా ఆదివారం ఆరాధన ద్వారా - మరియు మీరు దానిని గురించి ఏదో చేయాలని అనుకుంటున్నారు, కానీ వెంటనే అది మీ జీవితం రద్దీలో మరుగుపడి మరియు మర్చిపోతాము.

నిజమేంటంటే చెడు కారణంగా నీ జీవితంలో విశ్రాంతి లేని జీవితం లేదు. తరచుగా, మన జీవితాల్లో మంచి పనులు దేవుడు మనలో నాటడానికి ఇష్టపడే సత్యాన్ని మరగుపరుస్తాయి. మీ జీవితంలో దేవుని విధిని నెరవేర్చుటకు, మీరు మరింత ఎక్కువగా చేయవలసిన అవసరం లేదు. మీరు తక్కువ చేయవలసి ఉంటుంది.

ఉదాహరణకు యేసు స్నేహితులు మరియ మరియు మార్తా లను తీసుకోండి. ఒకరోజు వారు విందు కోసం యేసును ఆహ్వానించారు. మరియ యేసును వింటూ తన సాయంత్రం గడిపింది. మార్తా, మరోవైపు, విందును సిద్ధం చేయవలసి ఉండటం మరియు ఫలహారపు వంటను గురించి చింతిస్తూ, అంతా దాని స్థానంలో ఉన్నాయా లేదా అనే దానిపై తన మనసు నిండా ఆలోచనలతో ఉన్నారు.

ఆమె సోదరి యేసుతో కూర్చుని ఉన్నప్పుడు ఆమెకు అన్ని పనులు చేయవలసి ఉంటుందని మార్త ఆందోళన చెందింది. యేసు ఆమెతో ఇలా అన్నాడు: "ప్రియమైన మార్థా, మీరు ఈ విషయాలన్నింటిని గురించి భయపడి, కలత చెందుతున్నారు! ఆందోళన పడవలసిన అర్హత గల విషయము ఒక్కటే ఉంది. మరియ దానిని కనుగొంది, అది ఆమెనుండి తీసివేయబడదు "(లూకా 10: 41b-42 NLT).

మీ జీవితం ముగిసినప్పుడు, ఒకే ఒక్క విషయం మాత్రమే ప్రాముఖ్యముగా పట్టింపు లోనికి వస్తుంది: దేవుని కుమారుడిని తెలుసుకున్నావా? అదనపు క్రిస్మస్ బహుమతులు కొనుగోలు చేయగలిగింది ఎందుకంటే మీరు ఆఫీసు వద్ద పని చేసిన మీ దీర్ఘ గంటలు పట్టింపు లోనికి రావు. మీరు సెలవు భోజనం రుచికరంగా సిద్ధం చేయటానికి గడిపిన సమయం కూడా పట్టింపు లోనికి రావు. కానీ యేసు ను తెలిసికొనుటకు మీరు మీ సమయమును గడిపినప్పుడు అది యుగయుగములకు సరిపడునట్లుగా పట్టింపులోనికి వస్తుంది.

కాబట్టి క్రిస్మస్ సీజన్ ఆనందించండి. బహుమతులను అందమైన కాగితముతో చుట్టండి. పండుగలాగ మీ ఇంటిని అలంకరించండి. మీ కుటుంబంతో మంచి జ్ఞాపకాలను దాచుకోండి. కానీ యేసు పాదాల వద్ద కొంత సమయం గడపకుండా ఈ క్రిస్మస్ ని గడచిపోనీకండి. ఈ క్రిస్మస్ కు చాలా రోజుల తర్వాత అన్ని విషయాలు మరుగౌతాయి, నిజంగానే ఒక్క యేసును ఆరాధించడం మాత్రమే నిలుస్తుంది.

వాక్యము

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.