క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 5

పనిలో యేసును కోల్పోకండి

యోహాను 4:10 చదవండి

ప్రస్తుతం మీ చుట్టూ TV మరియు రేడియో తరంగాలు ఉన్నాయి. మీరు ఒక ట్యూనర్ కలిగి ఉంటే, ఆ తరంగాలు ఏమిటో మీరు చూడవచ్చు. కానీ మీరు వాటిని చూడలేని కారణంగా అవి నిజమైనవి కాదు అని కొట్టిపారేయలేము. మీరు కేవలం వాటిని చూడటానికి ట్యూన్ చేసుకోలేదు అన్నమాట.

ఇది మొదటి క్రిస్మస్ రాత్రి బెత్లేహెం లో అటువంటిదే జరిగింది. బేత్లెహెం ప్రయాణికులను వసతి కల్పించటం అనే ఏకైక ఉద్దేశ్యంతో పూటకూళ్ళ వసతి గృహము ఉన్నా, వాస్తవానికి, ఆ రాత్రి బెత్లెహెం లోని ప్రయాణీకులలో నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన కుటుంబానికి అక్కడ గది ఉండదు.

ఈ క్రిస్మస్, మన స్వంత హృదయాలకు ఈ కథ యొక్క ముఖ్యమైన సమాంతర భాగాన్ని కోల్పోకండి. నీ హృదయములో దేవునిని పెట్టుకోవటానికి నీ హృదయము చేయబడినది. మీరు దేవుని కొరకు మరియు దేవునికి చేత సృష్టించబడ్డారు. మీరు ఇది అర్థం చేసుకొనంతవరకు, జీవితం ఎప్పుడూ అర్ధవంతంగా ఉండదు. దురదృష్టవశాత్తు, మన జీవితాలను ఇతర విషయాలతో పూరించాము. మనము ఇతర అతిధిలను మన ఇళ్లలోకి ఆహ్వానిస్తున్నాము. మన హృదయం ఇతర ఆలోచనలు, ఆసక్తులు, విలువలు, ప్రేమ, మరియు ఇతర వాగ్దానాలతో నిండి ఉంటుంది.

మన జీవితాలు పూర్తిగా ఇతర విషయాలతో నిండి ఉన్నాయి, ఎంతగా అంటే యేసు మన చుట్టూ ఉన్నాకూడా మనము తెలుసుకోలేనంత. దేవుడు మన జీవితాల్లో అన్ని సమయాల్లో కనిపిస్తాడు, మనము ఎప్పుడు కూడా ఊహించని అవకాశాలను కల్పిస్తాడు, సమస్యల మధ్యలో మనకు తెలియదు మనం ఎటు వెళ్తున్నామని. కానీ తరచుగా, మనము అతనిని చూడలేము.

బైబిల్ లో అన్ని సమయాలలో ఇది జరిగింది. యేసు తను ఎవరో గుర్తించని ప్రజలతో మాట్లాడతాడు. యోహాను గ్రంధం లో యేసు ఒక స్త్రీ తన సమీపమునకు వచ్చినప్పుడు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. నీటి కోసం చూస్తూ, ఆమె యేసును గుర్తించలేదు. వాస్తవానికి ఆమె దేవుని కుమారునితో ఒక మతపరమైన చర్చను ప్రారంభించింది! అప్పుడు యేసు అన్నాడు, "నీ కొరకు ఉన్న దేవుని బహుమతి నీకు తెలిసి ఉంటె మరియు నీవు ఎవరితో మాట్లాడుతున్నావో ఎరిగియుంటే, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమునిచ్చునని ఆమెతో చెప్పెను " (యోహాను 4:10 NLT). కానీ ఆ స్త్రీ యేసును గుర్తించలేదు.

దేవుడు మీ చుట్టూ పని చేస్తున్నాడు - కేవలం క్రిస్మస్ సమయంలో కాదు కానీ మొత్తం సంవత్సరం అంతా. మీరు లేదా మీరు ఇష్టపడే వారు అతన్ని కోల్పోయారా?

వాక్యము

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.