క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 8

మెరుగైన జీవితాన్ని ఎంచుకోండి

నేటి వచనములను చదవండి.

నా చిన్న వయసులో, నా తల్లి నాకు న్యూడుల్స్ ను తినిపించేది. నేను అప్పుడు అది ఉత్తమ ఆహారంగా భావించాను! తరువాత నేను ఇన్-ఎన్-అవుట్ బర్గర్లు కనుగొన్నాను. నేను మంచి జీవితం నుండి మెరుగైన జీవితానికి వెళ్ళాను. న్యూడుల్స్ మంచిగా ఉండేవి, కానీ నోరూరించెడి ఒక ఇన్-ఎన్-అవుట్ బర్గెర్ మెరుగ్గా ఉంటుంది.

మీరు ఇప్పటికే ఒక మంచి జీవితం కలిగి ఉన్నాను అని అనుకుంటుఉండవచ్చు, కానీ మీకు కలిగిన మంచి జీవితము కంటే మించిన మెరుగైన జీవితము పొందగలరు అని తెలిస్తే, మీరు దాని గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు కదా?

దురదృష్టవశాత్తూ, మనకు కలిగిన స్వయం సమృద్ధి వలన మనకు మంచి తృప్తి కలిగిన జీవితం ఉండటానికి దోహదపడుతుంది అనే అహేతుక భావన కలుగుతుంది. మనము మా మటుకైతే అంతా సవ్యంగానే ఉంది అని భావిస్తున్నాము.

కీర్తన 10: 4 ఈ వంటి అది చెప్పింది: "చెడ్డ ప్రజలు గర్విష్టులైన కారణంగా వారు దేవుని కొరకు చూడరు; దేవుని గురించిన ఆలోచనలు వారికి ఉండవు ".

మొదటి క్రిస్మస్ కథ (లూకా 2) లో పూటకూళ్లవాని వలె, ఎక్కువ అతిథులు అవసరత పై మనకు నమ్మకం లేదు. మనకు అవసరం ఉన్న ప్రతిదీ కలిగిఉన్నాము అని అనుకుంటున్నాను.

అహంకారంతో ఒకే ఒక్క సమస్య ఉంది: దేవుడు మిమ్మును ఎందుకైతే సృష్టించాడో ఆ కారణాన్ని మీరు కోల్పోతారు. మీరు అతనితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు మిమ్మల్ని చేశాడు. మీ నిజమైన శక్తికి ఆధారం దేవునితో సంబంధం, మీరు దేవునితో అనుసంధానించ బడితె తప్ప, మీరు మీ జీవితమంతా తన ఉద్దేశాన్ని నెరవేర్చలేరు, ఇది మీరు ఊహించినదానికంటే చాలా గొప్పది మరియు మరింత ముఖ్యమైనది

కానీ శుభవార్త ఏంటంటే అది ఇంకా చాలా ఆలస్యం కాలేదు. మీ గతంలో ఏమి జరిగినా, మీ గతంలో అతనిని ఎన్ని సార్లు తిరస్కరించినప్పటికి దేవునితో సంబంధం కలిగి ఉండవచ్చు.

ఎవరికైనా దీనిని అర్థం చేసుకోవటానికి దేవుడు చాలా సులభం చేసాడు. ఇది కేవలం మూడు మాటలు: ఆయనను లోనికి ఆహ్వానించు.

యేసు చెప్పాడు, "వినండి! నేను నిలబడి మీ తలుపు వద్ద తట్టుచున్నాను. ఒక వేల మీరు నా గొంతు విని మీ తలుపు తెరిస్తే, నేను లోనికి వస్తాను మరియు మనము కలిసి తినవచ్చు "(ప్రకటన 3:20).

యేసు నీ తలుపు వద్ద తట్టుచున్నాడు. మీ జీవితంలోకి అతనిని అనుమతించడం ద్వారా మెరుగైన జీవితాన్ని గడపండి. అతనిని మీ జీవితానికి యజమానిగా చేయండి.

అది అన్నిటిని మారుస్తుంది.
రోజు 7రోజు 9

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.