క్రిస్మస్ యొక్క నిరీక్షణనమూనా

The Hope Of Christmas

10 యొక్క 3

యేసు యొక్క క్రిస్మస్ జాబితా

నేటి వచనములను చదవండి.

50 సంవత్సరాల కంటే ఎక్కువగా నా కుటుంబం యేసు పుట్టినరోజు పార్టీ జరుపుకొనే ఒక సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. నేను 3 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఇది ప్రారంభమైంది మరియు మా అమ్మని అడిగాను, "క్రిస్మస్ అంటే ఏమిటి?" మా అమ్మ నాకు ఏసు పుట్టినరోజు అని నాతో చెప్పింది. అద్భుతమైన 3 ఏళ్ల తర్కంతో, "మనము పుట్టినరోజు విందును చేసుకోవాలి!" అని అన్నాను. మేము పుట్టినరోజు కేక్, చల్లటి జ్యూస్, పాటలు, కేక్లు మరియు కొవ్వొత్తులతో పుట్టినరోజు విందు చేశాము.

ఆ సంప్రదాయం ఇప్పుడు నాలుగు తరాల వరకు కొనసాగుతోంది. యేసు యొక్క జన్మదినం పార్టీ పవిత్రమైన సమయం అయింది, ఇక్కడ మేము క్రిస్మస్ కథను చదివి, మనం ఏ విషయంలో కృతజ్ఞులమై ఉన్నామో మరియు మేము యేసుకు తిరిగి ఏమిస్తున్నామో ఈ విషయాలను అందరితో పంచుకొంటాము, ఈ వేడుకల్లో అత్యంత గుర్తుండిపోయే భాగాలలో ఒకటి.

యేసు తరచూ క్రిస్మస్ సమయంలో ఒదిలివేయబడతాడు. ఒక సారి ఇలా ఊహించండి, నేను మీ కోసం విందుని యేర్పాటు చేసి చాలామందిని ఆహ్వానించాను. ప్రతి ఒక్కరు చాలా బహుమతులు తెస్తారు, మరియు ఆహ్వానితులు మీకు తప్ప ఒకరితో ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చు కుంటారు - చివరికి మీకు ఏమీ దక్కదు.

అది క్రిస్మస్. యేసుకు తప్ప అందరికీ బహుమతులు ఇస్తాం. కానీ నిజాయితీగా ఆలోచించండి - ప్రతిదీ కలిగి ఉన్న దేవునికి నీవు ఏమి ఇవ్వగలవు?

నిజానికి, యేసు ప్రతిదీ కలిగి లేడు: ఆయన వద్ద లేనివి నాలుగు వున్నాయి మీరు వాటిని ఈ క్రిస్మస్ కు ఆయనకు ఇవ్వలేకపోతే తప్ప.

అతనికి మీ నమ్మకాన్ని ఇవ్వండి. విశ్వాసము స్వచ్ఛందమైనది. నీవు అతనికి నీ నమ్మకమును ఇవ్వకపోతే యేసు వద్ద నీ నమ్మకము లేదు. అతను దాని కోసం బలవంతం చేయడు.

మీ జీవితంలో యేసుకు మొదటి స్థానం ఇవ్వండి. నీ జీవితంలో మొదటి స్థానంగా యేసును తప్ప ఎవ్వరూ లేక ఎవరైనా ఉంటే అది ఒక విగ్రహం అవుతుంది. ఈ క్రిస్మస్ యందు, మీ ఆర్థిక, ఆసక్తులు, సంబంధాలు, కార్యక్రమాల్లో యేసును మొదటి స్తానం ఇవ్వండి - మీ ఇబ్బందుల్లో కూడా.

యేసుకు నీ హృదయం ఇవ్వండి. మీరు ప్రేమించేదే మీ హృదమౌతుంది, మీరు విలువైనదిగా ఎంచుకున్నది మరియు మీరు ఎక్కువగా లక్ష్య పెట్టేది. యేసు ఇలా అన్నాడు, "మీ సంపద ఎక్కడున్నదో, అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది" (లూకా 12:34 NIV). యేసుకు నీ హృదయాన్ని ఇచ్చే ఒక ముఖ్యమైన మార్గం ఈ క్రిస్మస్ కు మీ వనరులకు ఆయన పనికి ఇవ్వడం ద్వారా. యేసుకు మీ డబ్బుతో అవసరం లేదు, కానీ అది ఏమి సూచిస్తుందో అది ఆయన కోరుకుంటున్నారు - మీ హృదయం.

ఇతరులను యేసు వద్దకు తీసుకురండి. దేవునికి ఈ క్రిస్మస్ యందు అన్నింటి కంటే ఎక్కువగా ఒక కుటుంబము కావాలి. ఆయనను ప్రేమించాలని, ఆయనను నమ్మడాన్ని ఎంపిక చేసుకునే పిల్లలను ఆయన కోరుకుంటున్నాడు ఇది మనము క్రిస్మస్ వేడుక జరుపుకునేందుకు కారణం. యేసు యొద్దకు ఈ క్రిస్మస్కు ఎవరినైనా ఆహ్వానించండి. నీ జీవితంలో యేసు ఏమి చేసాడో చెప్పండి.

యేసు క్రీస్తును మొదటి క్రిస్మస్ నాడు జ్ఞానులు దర్శించినప్పుడు వారి వద్ద మిగిలిపోయినవాటిని యేసుకు ఇవ్వలేదు కానీ బదులుగా మూడు అతి ముఖ్యమైన, విలువైన బహుమతులు ఇచ్చినట్లు బైబిలు మనకు చెబుతోంది: "వారు ఆయనను సాష్టాంగపడి ఆయనను ఆరాధించెను. వారు తమ కానుకలను తెరచి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహుకరించారు. "(మత్తయి 2:11 NCV).

యేసుకు నీవు నీ విశ్వాసమునిస్తుండగా, నీ జీవితంలో ఆయనకు మొదటి స్థానమునివ్వండి, ఆయన పనిని నీవు విలువైనదిగా ఎంచుము, ఇతరులను ఆయన దగ్గరకు తీసుకెళ్లండి, నీవు జ్ఞానులు బహుకరించిన వాటి కన్నా అత్యంత విలువైన బహుమతులను నీవు దేవునికి ఇస్తున్నావు.

కాబట్టి యేసు కు ఈ క్రిస్మస్కు "పుట్టినరోజు శుభాకాంక్షలు" చెప్పండి. అతనికి మీ ఉత్తమమైనది ఇవ్వండి.
రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

The Hope Of Christmas

క్రిస్మస్ పండగ అనేకమైన ప్రజలకు, ఇది ఒక చాలా దీర్ఘమైనటువంటి చేయవలసిన పనుల జాబితాతో కూడిన రోజు గా మారటం వలన వారు చాలా త్వరగా అలసిపోయి వీలైనంత త్వరగా డిసెంబరు 26 వ రోజు వస్తే బాగుండు అని కోరుకొనే విధంగా మారింది. క్రిస్మస్ పండగ కేవలం మీరు సెలవులు జరుపుకొనే విధానంలో మార్పే కాకుండా మిగిలిన మీ జీవితం అంతా కూడా ఎందుకు మార్పు చెందాలో మరియు ఈ వరుస సందేశాలలో పాస్టర్ రిక్ మీరు క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు గల ముఖ్యమైన కారణాన్ని గుర్తుచేసుకోవడానికి మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

More

ఈ దేవుని వాక్య ధ్యానమును © 2014 రిక్ వారెన్ చేత. అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. అనుమతితో వాడినది.