పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఆయన ఏమైయున్నాడో జ్ఞాపకము చేసుకొనుము
దేవుడు జ్ఞాపకము చేసుకొనుటను ఇష్టపడును. బైబిల్ చరిత్రంతటిలో, ప్రాముఖ్యమైన కార్యక్రమములను జ్ఞాపకార్థ సూచనులుగా ఆయన మలచుటను - లేక తన ప్రజలకు ఆయన చూపిన రక్షణార్థమైన శక్తిని మరియు ప్రేమను గుర్తుచేసుకొనే ఒక నిర్దిష్ట సమయము కొరకు సంవత్సరపు పండుగను ఆచరింపుమని పిలుపునిచ్చుటను మనము చూస్తాము.
ఈ విధముగా గుర్తుచేసుకొనుట ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకొనెను?
ఎందుకనగా, ఆయన ఏమై యున్నాడో మరియు ఆయన మన కొరకు ఏమి చేసెనో లోతుగా గ్రహిస్తూ జ్ఞాపకము చేసుకొనుమని దేవుడు మన నుండి కోరుకొనును. ఈ వాస్తవమును, దాని యొక్క సంపూర్ణతలో స్పష్టముగా గ్రహిస్తూ మన ప్రాణాత్మ దేహముతోటి మనము అనుభవించాలని ఆయనకు తెలియును.
దేవుడు శరీరధారియై ఈ లోకమునకు వచ్చి తిరిగి ఆయన వద్దకు మార్గము చూపుట చేత: ఈ క్రిస్మస్ నాడు, దేనికి లేనంత రీతిలో, విశ్వాసులకు ఈ అద్భుతమైన కార్యక్రమమును ఒక జ్ఞాపకార్థ వేడుకగా జరుపుకొనుటకు అవకాశము కల్పించును.
ఇది చేయండి: సైనిక దళాలలో ఉండి తమ ఇంటికి దూరముగా ఉంటూ క్రిస్మస్ ను జరుపుకుంటున్న ఎవరికైనా ఒకరికి ప్రోత్సాహకరముగా ఒక ఉత్తరం వ్రాయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More