పశువుల పాకకు ప్రయాణమునమూనా
మన సమీపబంధువైన యేసే విమోచకుడు
దాసత్వము మరియు బంధకముల నుండి మానవజాతిని రక్షించగల ఒక దైవ విమోచకునిని పాత నిబంధన సూచిస్తూ ఉన్నది. రాబోవు కాలంలో కలుగు విమోచనకు గల గురుతులలో ఒకటి - విమోచకుడైన సమీప బంధువు, తన బంధువుకున్న అప్పులన్నిటిని చెల్లించి వానిని రక్షించుటకు ఎంచుకొనగల అత్యంత సమీపబంధువైన విమోచకుడు.
ఈ సూచన యొక్క నెరవేర్పుగా, యేసే మన సమీపబంధువైన-విమోచకుడై యున్నాడు. మానవ స్వభావములో పాలుపంచుకొనుటకు ఆయన రక్త మాంసములు గలవాడై మనుష్య కుమారునిగా అదే విధముగా దేవుని కుమారునిగా ఉండెను. మన పాప పరిహారమంతటిని చెల్లించి, మన సృష్టికర్త దగ్గరకు తిరిగి వెళ్లేందుకు మార్గము చూపుటకు మన వంటివాడై మనతో పాటు నడిచెను. ఆయన తప్ప మన పాపముల నుండి, మరియు వాటి బంధకముల నుండి మనలను విడిపించగలవారు ఇంకెవ్వరులేరు.
ఇది చేయండి:నీ పోరుగువారికి లేక నీతోటి సహచరులకు చక్కటి వంటకములను వండి వారిని తీపిజేయుము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More