పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఆయన ఉన్నత ఉద్దేశ్యము
అనేకమార్లు మనము గొప్ప కృంగుదలతో నిండిన సమయాల్లోనే మన జీవితముల పట్ల ఆయనకుగల ఉన్నత ఉద్దేశ్యములను కనుగొనుటకు దేవుడు మనకు అవకాశములను ఇచ్చును.
మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన కొంతకాలము తర్వాత, ఒక ఊహాతీతమైన వార్తను ఆమె మోసికొని అతని దగ్గరకు వచ్చెను. ఆమె గర్భము దాల్చెను-మరియు అది ఒక గొప్ప అద్భుతము యొక్క ఫలితమే అని ఆమె పేర్కొనెను. యోసేపు యొక్క హృదయము నలిగిపోయి ఉండాలి. అనీతిమంతురాలైన స్త్రీని వివాహమాడి ఆ నిందను భరించుట లేక అతను ఎంతగానో ప్రేమించి, గౌరవించిన ఆమెను నిందలపాలు చేయుట-లాంటివే తప్ప మరేవిధమైన మంచి ఎంపికలు తనయెదుట కనబడుట లేదు. అనూహ్య మలుపులు తిరిగిన ఈ సంఘటనతో అసలు దేవునికి ఏ సంబంధము ఉంటుంది?
ఆ రాత్రివేళ యోసేపు నిద్రించుటకు ప్రయత్ననించు చుండంగా, మరియను నమ్ముమని-మరియు దేవుని కుమారునికి భౌతికంగా తల్లితండ్రులుగా ఉండుటకు నియమింపబడిన ఈ ప్రత్యేకమైన పిలుపులో పాలుపొంది ఆమెను మనస్పూర్తిగా చేర్చుకొనుమని ఒక దేవదూత వచ్చి అతనికి తెలియజేసెను. అపనమ్మికతో లేక మత్సరముతో యోసేపు ప్రతిస్పందించి యుండవచ్చును కాని అతని విశ్వాసము ద్వారా, నిత్యత్వమునకు మానవాళి ఆశీర్వదించబడే సాటిలేని ఈ ఉన్నత ప్రణాళికను దేవుడు నెరవేర్చెను.
ఇది చేయండి: దినములో కొంత సమయము వెచ్చించి నీ జీవితపు పాలి వాళ్ళలో ఒక చిన్నబిడ్డకు తనకిష్టమైన ఒక కథలపుస్తమును చదివి వినిపించుము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More