పశువుల పాకకు ప్రయాణమునమూనా
దేవుడు లోతుగా చూచును
ఈనాటి దినములలో గనుక యేసు లోకమునకు వచ్చినచో, ఆయన పుట్టుకను గూర్చిన అద్భుత వార్తను కేవలం ఒక ప్రముఖ పాస్టర్ల బృందానికి మాత్రమే ప్రకటించి - చక్కగా అభివృద్ధి చెందుచున్న ఒక మంచి చదువుకున్న కుటుంబాన్ని ఎన్నుకొనునేమో అని మనలో కొంతమంది అనుకొనవచ్చును. కాని ఈ క్రిస్మస్ కథ యొక్క వాస్తవికత, దేవుని దృష్టికి మరియు లోకానుసారమైన మన ప్రామాణికాలకు గల వ్యత్యాసమును చూపును. ఈకాలమందైతే, తక్కువ ఆదాయ వనరులుండి కష్టపడి పనిచేసే మెకానిక్ మరియు అతని వెయిట్రెస్ భార్యకు యేసు జన్మించవచ్చును. మరియు దేవదూతలైతే బహుశా గుంటలు త్రవ్వే పనిని ముగించుటకు రాత్రి వరకు పని చేసే మాజీ దోషుల బృందమునకు కనబడవచ్చునెమో.
మరియ-యోసేపులు ఎలాంటి సామాజిక స్థితి నుండి వచ్చారో మరియు గొర్రెల కాపరులను యూదుల ప్రమాణాల ప్రకారం అపవిత్రమైన మరియు నమ్మదగని వారుగా చూసేవారో అన్న స్థితిని మనం తరచుగా మరచిపోతూ ఉంటాము. ఆ అద్భుత రాత్రివేళ యేసు ఉన్న పాకలో నిలిచి యున్న ప్రతి వ్యక్తి కూడా తమ జీవితములలో తిరస్కారమును మరియు ఒంటరితనమును అనుభవించిన వారే, అయినప్పటికి యుగములన్నిట పరిశుద్ధమైన ఘటనలలో ఒకటైన దీనిని అనుభవించుటకు దేవుడు వీరినే ప్రత్యేకమైన వ్యక్తులుగా ఎంచుకొనెను. వారి హృదయములను మరియు వారి అసలైన విలువను ఎవ్వరూ చూడకపోయినప్పటికి, ఆయన చూసెను.
ఇది చేయండి:కొంతమంది స్నేహితులను పోగుచేసి స్థానిక అనాధాశ్రయము వద్ద భోజనమును వడ్డించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More