పశువుల పాకకు ప్రయాణమునమూనా
అపరిమితమైన ప్రేమ
దేవుని ప్రేమ కేవలం రక్షణ అనుభవమునకే పరిమితం కాదు; జీవితంలోని ప్రతి అంశమునకు ఇది వర్తించును. ఏదేను తోటలో-ఆదాము మరియు అవ్వలు పాపం చేసిన తర్వాత కూడా-మానవజాతి పట్ల దేవుడు తన ప్రేమను ఎన్నటికి ఎడబాయనీయలేదు. ఆయన వారిని అక్కడే విడిచిపెట్టి యుండవచ్చును, కాని ఆయన అలా చేయలేదు. ఆయన వారిని ప్రేమించెను మరియు తనతోటి వారు కొల్పోయిన సహవాసమునకు తిరిగి వారిని తీసుకువచ్చుటకు ఆయన సంకల్పించెను. పాత నిబంధన అంతటిలో, ప్రతి సమయమందును తన రక్షణ యొక్క రాక కొరకు వేదికను సిద్ధపరుస్తూ, ప్రేమలో మనలను చేరువ అవుతున్న దేవునినే మనం చూస్తాము.
యేసు క్రీస్తు - మానవజాతి కొరకైన పరిపూర్ణ రక్షణా పూర్వకమైన కృపను గూర్చిన పురాతనమైన ఆ వాగ్దానమునకు నెరవేర్పుగా ఉన్నాడు. ఆయన పుట్టుక, యుగములన్నిట మనలను వెదుకుతూ మరియు రక్షిస్తూ ఉన్న ఆయన యొక్క నిత్య ప్రేమను చాటుతూ మన కొరకు సృష్టికర్త యొక్క వ్రాతపూర్వక సూచికయై ఉన్నది. విరిగినలిగిన ఈ ప్రపంచం యొక్క ఒత్తిడులకు మరియు వేధింపులకు దూరంగా ఆయన పరలోకంలోనే ఉండవచ్చును, కాని ఆయన మాత్రమే అందించగల ఈ ప్రేమ మనకు అవసరమని ఆయనకు తెలియును. కావున మన రక్షకుని యొక్క పుట్టుకను నీవు వేడుకగా జరుపుకుంటు ఉండంగా, నీ పట్ల ఆయనకు గల లోతైన ప్రేమను గూర్చి ఈ వేడుక ఏమని చెబుతుందో ఒక్కసారి ఆలోచనచేయుము.
ఇది చేయండి:మీరు రాజీపడవలసిన బంధువు లేదా స్నేహితుడిని సంప్రదించండి. దేవుడు మొదట మిమ్మల్ని క్షమించాడు గనుక మీరును క్షమించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More