పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఆయన నీ కొరకే వచ్చెను
ఈ సమయమందు క్రీస్తు యొక్క పుట్టుకను మనము సంబరాలు చేసుకొనుచుండగా, మన హృదయములలో గల ఆనందం కేవలం మనం ప్రేమింపబడ్డాము అను సంతోషకరమైన విషయము చుట్టూనే తిరుగవలెను. యేసు ద్వారా, నీ పట్ల ఆయనకున్న ప్రేమను దేవుని హృదయము బాహాటముగా చాటెను. నీ కొరకు ఇక్కడికి రావలెనని ఆయన ఎంచుకొనెను!
నీ కొరకు నిబద్ధత కలిగిన ఒక రక్షకుడు నీకున్నాడు. నీతో రక్త సంబంధం కలిగియున్న ఒక సహోదరుని కంటే-నిన్ను అంటిపెట్టుకొని ఉండే స్నేహితుడాయన. కావున జీవితం కష్టతరముగా ఉన్నప్పుడు, ఆయన ఎన్నటెన్నటికి నిన్ను విడిచిపెట్టడు అనే సత్యంలో నీవు విశ్రాంతి తీసుకోవచ్చును. నీవు ఎన్నటికి ఒంటరివి కావు.
2000 సంవత్సరముల కంటే మునుపే వచ్చిన ఆయన రాక యొక్క ఉద్దేశ్యమును గూర్చి నీవు ఆలోచన చేయుచుండగా, ఒక పునరుద్ధరించిన భావనతో కూడిన తన సన్నిధితో నీ హృదయాన్ని తాకడానికి ప్రభువును అనుమతించండి. బహుశా నీవు ఒక లోతైన గాయముచేత గాయపరచబడి, ఆ బాధంతటితో ఏ విధముగా ముందుకు సాగగలనో అని పోరాడుతూ ఉండవచ్చును. ఇమ్మానుయేలైన-యేసు-నీకు సమీపముగా ఉన్నాడు, మరియు ఎటువంటి శ్రమలలోనైనా నీతో నడిచి, దానిలో నీకు కావలిసిన ఓదార్పును ఆయన ఇచ్చును. ఈ లోకములోనికి ఆయన రాక యొక్క భావము ఇప్పుడైనను నీ జీవితమునకొక నూతన నిరీక్షణను అందించునుగాక.
ఇది చేయండి:మీ స్నాన గది యొక్క అద్దము మీద, ఒక మార్కర్ తో ఎన్నికచేయబడ్డానుమరియు అంగీకరించబడ్డాను అను పదములను వ్రాయుము. యేసు చేత నీవు ఎన్నికచేయబడి మరియు అంగీకరించబడితవనే విషయమును ప్రతి ఉదయం నీకు నీవే గుర్తు చేసికొనుము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More