పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఆయన ఇంకొక సాధారణ పసిబిడ్డ కాదు
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే తన పుట్టుక, జీవితము మరియు మరణము గురించి వందల ప్రవచనములు ముందుగానే చెప్పబడియుండవు.
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే అత్యంత అద్భుత రీతిలో గర్భము దాల్చియుండబడడు.
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే పరలోక సైన్యసమూహము చేత తన పుట్టుక గూర్చి ప్రకటించబడే ధన్యతను పొందియుండడు.
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే అతనిని కనుగొనుటకు, కాపరులు తమ గొర్రెలన్నిటిని విడిచిపెట్టి వెళ్ళేంతగా ప్రేరేపింపబడియుండరు.
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే తనను వెదకాలనే తృష్ణతో తూర్పు నుండి జ్ఞానులు పయనమగుటకు బలవంత పెట్టబడియుండరు.
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే సుమెయోను యొక్క జీవితకాలపు వెదుకులాట ధన్యకరమై యుండదు లేక అన్నా యొక్క పెదవుల నుండి స్తుతి రప్పించియుండడు.
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే గ్రుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడిని, దురాత్మలచేత పీడింపబడుచున్న వారికి విడుదలను, దోషులకు క్షమాపణను మరియు మృతులకు జీవమును ఇవ్వగల వ్యక్తి అయియుండే వాడు కాదు.
ఇంకొక సాధారణ పసిబిడ్డే అయితే లోక పాపమంతటిని మోసుకొనిపోవుటకు ఇష్టపూర్వకముగా వచ్చిన దేవుని గొర్రెపిల్ల అయియుండడు.
ఆయన ఇంకొక సాధారణ పసిబిడ్డ ఏమాత్రం కాదు. ఆయన భూతభవిష్యత్ వర్తమాన కాలములలో నిరంతరము ఏకరీతిగా ఉన్న రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువైన యేసు క్రీస్తు.
ఇది చేయండి:లూకా సువార్తలో గల ఈ కథను చదవండి (1:26-2:21).
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More