పశువుల పాకకు ప్రయాణమునమూనా
యేసు జీవితములను మార్చును
యేసు పుట్టిన ఆ రాత్రివేళ, గొర్రెల కాపరులే మొదటి సాక్షులుగా యున్నారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఆ వార్త ఎలా వ్యాపించిందో ఒక్కసారి ఊహించండి. బెత్లహేము ప్రాంతము పూర్తిగా అలసట చెందిన యాత్రికులతో నిండినది, గొర్రెల కాపరుల ఆశ్చర్యమును మరియు ఉత్సాహామును విస్మరించడం వారికి చాలా కష్టం.
తన పుట్టుక నుండి తాను ఆరోహణమయ్యే వరకు, యేసు తన ప్రభావమును గ్రహించిన వారందరి జీవితములను మార్చాడు. ఎందుకనగా మనము ఆయన ప్రేమ చేత తాకబడినప్పుడు అది మార్పును తెచ్చును, ఈ ప్రపంచమును ఇంకనూ ఆయన ప్రభావితం చేయుచూనే ఉన్నాడు. మరియు ఆయన ప్రేమ చేత మార్పు చెందిన మన వంటి వారి ద్వారా, ఆయన తన నూతన జీవము యొక్క సందేశము ద్వారా నశించిన వారిని ఇప్పటికి వెదుకుతూనే ఉన్నాడు. ఆ మొదటి క్రిస్మస్ లో గొర్రెల కాపరులవలె, ఇప్పుడు మనము ఆయన వర్తమానికులం.
నీ జీవితాన్ని యేసు ఎలా మార్చాడనే దాని గురించి నీ గాధ ఏమిటి? లోకములో కృంగియున్నవారితో లేదా ఒక గమ్యం లేకుండా వెదుకులాడుతున్న వారితో ఆయన ప్రేమను పంచుకోవడం కంటే గొప్ప బహుమతి నీవు వారికి ఏమి ఇవ్వగలవు?
ఈ దినము, ఆయన పుట్టుకను మరియు ఆయన నీకు చూపిన తన శాశ్వత ప్రేమను కనుపరచిన విధానాలను తలంచి వేడుక చేసుకోండి. ఆ తరువాత, ఇతరుల వద్దకు వెళ్ళి వారు కూడా ఆయన చేత ప్రేమించబడ్డారనే విషయమును వారితో పంచుకొనండి.
ఇది చేయండి:మహా సంతోషకరమైన ఈ సువార్తను ఇతరులతో పంచుకొనండి! యేసు గురించి మరియు నీ జీవితంపై ఆయన చూపిన ప్రభావం గురించి ఎవరితోనైనా చెప్పండి.
పరమతండ్రి చెంతకు చేరి ఆయనతో లోతైన సహవాసమును పెంపొందించుకొనే విషయముల గురించి ఇంకా తెలుసుకొనుటకు దీనిని నొక్కండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More