పశువుల పాకకు ప్రయాణమునమూనా
సంపూర్ణముగా ఆయన కొరకు జీవించుము
ఒక క్రొత్త రాజు కొరకు ఎదురుచూస్తున్న ప్రజల విమోచన మరియు నిరీక్షణకు యేసుని పుట్టుక ఒక వాగ్దానరూపమై యున్నాడు. ప్రతి పరిస్థితియందు దేవుని ఎట్లు వెంబడించవలెనో ఆయన జీవితం మనకొక మాదిరిగా ఉన్నది. ఆయన మరణము ద్వారా మన పాపముల యొక్క పరిహారమును చెల్లించి, దేవునితో మనకు గల సంబంధమును తిరిగి సమకూర్చబడుటకు మనలను అనుమతించెను. ఆయన పునరుత్ధానము పాపము యొక్క మరియు మరణము యొక్క శక్తిని ఓడించి, పాత నిబంధన ప్రవచనములను నెరవేర్చెను. అయినప్పటికి యేసు పరిచర్య ఎప్పటికీ తరాలను మించి, ప్రతిరోజూ ప్రపంచాన్ని మారుస్తూనే ఉంది.
తన విమోచనా ప్రణాళికను నిర్దేశిస్తూ, దేవుడు ఈ లోకమునకు తన కుమారుని మొదటిసారి దీనుడైన ఒక చిన్నబిడ్డగా పంపెను. ప్రతిఒక్కరు ప్రభువుగా ప్రకటించగలిగే విజయవంతమైన రాజుగా యేసు మరలా వచ్చును. ఆయన యొక్క విజయవంతమైన రాక కొరకు వేచి యున్న వారముగా, నూతన సృష్టిగా మనము సంపూర్ణముగా ఆయన కొరకు జీవించగలము.
మరియు ఈనాటికి కొనసాగుతున్న ఆయన రాజ్యము యొక్క సమకూర్పు కార్యము నందు ఆయనతో పాలివారమై యుండగా, రాజుల రాజుగా మరియు ప్రభువుల ప్రభువుగా ఆయన నామమును మనము ఘనపరచెదము.
ఇది చేయండి: తిరిగి సమకూర్చే ఒక చిన్న కార్యమును చేయుము. నీది కాని చెత్తను తీసివేయుము లేక మీ వాడి విస్మరించిన వస్తువులను పొదుపు దుకాణానికి దానం చేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More