పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఆయన పుట్టుక కేవలం ప్రారంభమే
క్రిస్మస్ యొక్క సందేశము కేవలం పొత్తి గుడ్డలచేత చుట్టబడి పశువుల పాకలో పరుండిన ఒక చిన్న పసికందుతో ముగిసేది కాదు. ఒక చిన్నబిడ్డగా పుట్టుట అను కారణమును మనము తప్పక గుర్తుంచుకోవాలి. తన సృష్టిని రక్షించేందుకు నిత్యుడైన దేవుడు ఈ లోకమునకు ఒక సాధారణ మానవునిగా వచ్చెను అనునదియే క్రిస్మస్ యొక్క సంపూర్ణ సందేశము. పొత్తిగుడ్డలలో ఉన్న ఆ చిన్నబిడ్డ ఒక ఉద్దేశ్యం నిమిత్తము వచ్చెను: ఆయన మనకొరకు మరణించుటకే వచ్చెను.
ఆ చిన్నారి చిట్టి చేతులే కఠినమైన చెక్క దాణాలో పనిచేసే వడ్రంగి చేతులుగాను, మరియు అవే చేతులు రాబోయే కాలంలో కఠినమైన, చెక్క సిలువకు మేకులతో కొట్టబడి వ్రేలాడదీయబడ్డాయి. ఆ చేతులకే గాయములున్నప్పటికీ, మనకు తన నిత్యజీవమును అనుగ్రహించుటకు, పాపమును మరియు మరణాన్ని ఓడించిన పిమ్మట ఆయన తన సొంత శవపు నారబట్టలను జాగ్రత్తగా విప్పెను. కష్టతరమైన ఈ లోకములో మనము పదే పదే పడిపోతున్నప్పుడు చివరకు ఆ చేతులే ప్రేమతో చాపబడి మనలను పైకి లేవనెత్తెను.
ఈ క్రిస్మస్ పండుగ వేళలో, సమస్తం కూడా ఉరుకుల పరుకుల మీద పరుగెత్తినట్లుగా అనిపించినప్పుడు, ఆ హడావిడిలో మరియు లోకాశలలో నీవు చిక్కుకొనవద్దు.
ఇది చేయండి: మీ చేతులతో ఏదో - ఒక కార్డు, ఒక డ్రాయింగ్ లేక ఒక క్రాఫ్ట్‌ను తయారు చేసి, దాన్ని ఎవరికైనా స్వచ్ఛంద బహుమతిగా ఇవ్వండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More