పశువుల పాకకు ప్రయాణమునమూనా

Journey To The Manger

70 యొక్క 19

దేవుని హృదయము బయలుపరచబడెను

అసలు ఈ లోకమునకు క్రీస్తు ఎందుకు వచ్చెనో తత్వపరమైన కారణములను ఒక్క క్షణం పక్కన పెట్టి, కేవలం నీ పట్ల దేవునికి గల గొప్ప ప్రేమను మాత్రమే తలంచు. ఇమ్మానుయేలుగా, మనతో నడుచువానిగా ఉండుటకు తన మహిమను మరియు ఘనతనంతంటిని విడిచి పెట్టి ఆయన నిన్ను ప్రేమించెను. ఆది నుండి అనగా-ఏదేను తోట మొదలుకొని నీ వ్యక్తిగత జీవితములో ఆయన చేసిన కార్యముల వరకు-సమస్తమును ఒక్కసారి ఆలోచిస్తే కేవలం ప్రేమ చేత మాత్రమే ప్రేరేపింపబడినదిగా మనము చూడవచ్చును.

తన రాక కొరకు దశాబ్దము వెంబడి దశాబ్దము మందిరములో ప్రార్థిస్తూ ఉండిన ఒక ఎన్నికలేని పేద విధవరాలునకు కనిపించడానికి ఆయనను ఆ ప్రేమే ప్రేరేపించెను. ఆయన పరిచర్య చేసి స్వస్థపరచిన అనేకమంది వ్యక్తులను కలుసుకొనుటకు దేవుడు తన సమయమును కూడా పునర్వ్యవస్థీకరించెను. మరియు ఆ ప్రేమ చేతనే ఘోరమైన పాపులతో మరియు సుంకపు గుత్తదారులతో ఆయన భోజనము చేసెను. ఎవరినైతే సమాజము కాదని పక్కన పెడుతుందో వారినే ఆయన తన కౌగిట్లో చేర్చుకొన్నాడు. ఆయన జీవితం క్రియారూపకమైన ప్రేమతో కూడినది.

మన మధ్యలో నివసించి ఆయనతో లోతైన వాస్తవిక సహవాసమునకు ఆహ్వానము పలికిన యేసు, దేవుని యొక్క నిజమైన హృదయమును చూపించెను. ఆయన పాలించుటకు గాని నాశనం చేయడానికి గాని రాలేదు, ఆయన వద్దకు వచ్చే వారందరికీ నూతన జీవితాన్ని అనుగ్రహించుటకు ఆయన వచ్చెను.

ఇది చేయండి:కొంతకాలంగా మీరు మాట్లాడని ఒక స్నేహితుడికి కాల్ చేసి, తిరిగి ఆ స్నేహాన్ని కొనసాగించుటకు కొంత సమయం కేటాయించండి.

వాక్యము

రోజు 18రోజు 20

ఈ ప్రణాళిక గురించి

Journey To The Manger

2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Touch Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు https://intouch.cc/yv18 దర్శించండి

సంబంధిత ప్లాన్లు