పశువుల పాకకు ప్రయాణమునమూనా
విశ్వాసముతో నడిచెదము
నీతిమంతులైన అనేకమంది స్త్రీ పురుషుల విశ్వాసము తీవ్రముగా పరీక్షింపబడే వరకు వారు తమ నిరీక్షణ యొక్క ఫలములను చూడలేదని లేఖనములు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో, వారి ప్రార్థనలలో కొన్నింటికి ఖచ్చితమైన సమాధానాలు వారి జీవిత కాలమంతటిలో కూడా చూసియుండలేదు. అయినప్పటికి అనుదినము దేవునిపై వారికిగల నమ్మకము ఏమాత్రమూ సడలలేదు.
అప్పటికి నాలుగు శతాబ్దముల వరకు ఇశ్రాయేలులో వ్రాయు ప్రవక్త ఒక్కరును లేనప్పటికి, సుమెయోను మరియు అన్నా వంటి దైవిక వ్యక్తులు— ప్రభువు తాను ఏమి చెప్పెనో అది ఖచ్చితముగా నెరవేర్చునను నమ్మిక యందు స్థిరపరచబడి—నిజమైన మెస్సీయ కొరకు ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. తమ వృద్ధాప్యంలో కూడా, వారు తమ ఆశను వదులుకోలేదు. ఎవ్వరూ గుర్తించలేకపోయినా—ఆయనను తన తల్లి చేతుల్లో చూసిన వెంటనే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తిని వారు గుర్తించడంలో ఆశ్చర్యం ఏమి లేదు.
మందిరమునకు అతి తక్కువ ఖర్చుతో కూడిన అర్పణము తీసుకువచ్చిన ఆ యవ్వన కుటుంబము కడు బీదవారు అన్నది వారికి విశేషము కాదు. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచూ, దేవునితోటి నిత్యము సహవాసము కలిగిన ఈ సుమెయోను మరియు అన్నా ఆయన యొక్క రాజరికమును చూచిన వెంటనే కొనుగొన్నారు.
ఇది చేయండి:అవసరతలో ఉన్న పిల్లలకు క్రిస్మస్ బహుమానములను అందించే గుర్తింపు నొందిన స్వచ్చంద సంస్థకు ఒక క్రొత్త బొమ్మను కొనివ్వండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More