పశువుల పాకకు ప్రయాణమునమూనా
దేవుని విమోచనా ప్రణాళిక
యేసు ఈ భూలోకమునకు వచ్చినప్పుడు, తన సొంత ప్రజలే తనను గుర్తించలేకపోయిరి. తమ ప్రవక్తల యొక్క సాక్ష్యముల చేత ఆశీర్వదించబడి, దేవుడు తమపై చూపిన ఎడతెగని విశ్వాస్యత యొక్క గొప్ప చరిత్రను యూదులు కలిగియున్నప్పటికి, వారెంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మెస్సీయను మాత్రము వారు గుర్తుపట్టలేకపోయిరి. ఆయన వచ్చి, అన్య దేవత ఆరాధనను నాశనం చేసి రోమా ప్రభుత్వము యొక్క బంధకముల నుండి, వారి రాజకీయ అణిచివేతదారుల నుండి, తమను విడిపించుననే దృక్పధమునే కలిగియున్నారు. తమ మనస్సులలో ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రముల వారిని తిరిగి రాజ్యములోనికి మరియు అధికారములోనికి తెచ్చుట ద్వారా, తమను దేవుని రాజ్యములోకి ప్రవేశింపజేయునని వారు అనుకొనెను.
కాని యేసు వచ్చి నేరుగా విలువలేని అన్య దేవత ఆరాధనను తీసివేసి జయభేరి మ్రోగించుటకు రాలేదు. ఈ భూలోకమునకు సంబంధించని రాజ్యమును స్థాపించుటకు ఆయన వచ్చెను - మరియు విరిగినలిగిన ఈ లోకమునకు దేవుని సత్యమును మరియు ఆయన సన్నిధిని తీసుకొనివచ్చెను.
మన యొక్క గర్వము, దేవుని విమోచనా ప్రణాళిక యొక్క సత్యమునకు అంధులనుగా చేసినప్పుడు, ఆ రారాజు యొక్క రాకను గ్రహించలేని ఆ తరము వారి కంటే మనం ఎంత మాత్రము భిన్నముగా ఉన్నాము? ఆయన రాజ్యము యొక్క వాస్తవిక రాకకు తెరువబడిన ఆత్మీయ నేత్రములు కలిగిన కొద్దిమందివలె మనము ఉండుదము గాక.
ఇది చేయండి:దేవుని రాజ్యము యొక్క రాక గురించి ప్రార్థించమని యేసు మనకు బోధించెను. ఒక అజ్ఞాతవ్యక్తిని వారి నిర్దిష్ట అవసరాల గురించి మీరు వారి కోసం ప్రార్థించగలరేమో అని అడగండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More