పశువుల పాకకు ప్రయాణమునమూనా
దేవునికి ప్రతిస్పందించుట
మరియ యోసేపుల ప్రధానము గూర్చి బహుశా వాళ్ళ ఇరువురి కుటుంబములు ఎంతోకాలంగా ప్రార్థిస్తూ యుండవచ్చును. ఇరువురు దావీదు మహారాజు యొక్క వంశావళి నుండి వచ్చినవారే- గనుక వాళ్ళిద్దరి కుటుంబములు సంతోషించుటకు కారణముగా కాగల ఒక సరైన కలయిక అని అనుకుని యుండవచ్చును. కాని అకస్మాత్తుగా, వారి వేడుకకు దేవుడు అంతరాయం కలిగించెను.
దేవదూత యొక్క రాక, మరియ కథలోనికి వేగంగా వచ్చుటతో అతని సందేశానికి సిద్ధమగుటకు ఆమెకు సమయం దొరకలేదు. తాను కన్యక అయినప్పటికి-ఆమె దేవునివలన కృప పొందినదై ఆయన కుమారునికి జన్మనిచ్చునదాయెను. తన కుటుంబము మరియు సమాజము ఏమనుకొనునో అనే విస్మయము చెందించే ఆలోచనలు తన మనస్సును నింపినప్పుడు-సుడిగాలుల వంటి భావోద్వేగాల గుండా ఆమె వెళ్ళియుండవచ్చును. ఆ విధంగా చూస్తే కొంచెం భయపెట్టేదిగా మరియు చూడటానికి అసాధ్యముగా కనిపిస్తున్నఈ విషయంలో దేవుని ప్రణాళికకు ఆమె లోబడవలెనా?: అన్న విషయముమీద మరియ నిర్ణయము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడెను.
మరియ యొక్క సాహసోపేతమైన మరియు వినయపూర్వకమైన స్పందన ప్రతి విశ్వాసికి ఒక ఆదర్శకబాటను వెలిగించింది. దేవుడు కలిగించే అంతరాయాలకు మనము లోబడినప్పుడు, మన జీవితముల పట్ల ఆయన ఎల్లప్పుడు ఉన్నత ఉద్దేశ్యములు కలిగియున్నాడనే సత్యములో మనము విశ్రాంతి పొందవచ్చును.
ఇది చేయండి: ఒక కుటుంబముగా, క్రిస్మస్ వేడుకను వివిధ సంస్కృతుల వారు ఎలా జరుపుకుంటారో పరిశోధన చేయండి. కొన్ని నూతన సంప్రదాయాలను అవలంబించుటను గురించి ఆలోచించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More