పశువుల పాకకు ప్రయాణమునమూనా
యేసును కలుసుకొనుట
గొప్ప మహిమతో ప్రకాశించు వెలుగుతో మరియు స్తోత్రముతో నింపబడిన ఆ రాత్రివేళ, పరలోక సైన్యసమూహముతో కూడనుండి ప్రభువు దూత తమతో మాట్లాడినప్పుడు గొర్రెల కాపరులు పొందిన ఆశ్చర్యమును గూర్చి ఒక్కసారి ఊహించండి. దూత తమతో చెప్పినదంతా తెలుసుకొనుటకు వారు తమ మందలను మరియు పొలములను విడచి వెళ్తూ ఉండంగా వారి భావోద్రేకమును తలంచండి.
మెస్సీయను ముఖాముఖిగా కలసుకొనుట ద్వారా జీవితమును మార్చగల అనుభవమును వారు ఆ రాత్రిపూట పొందుకున్నారు. వారి హృదయములు ఆయనను ఆరాధించుటకు కదిలింపబడెను. పశువుల పాకలో ఉన్న ఆ శిశువు ఎవరని దూతలు దీనులైన ఆ మందకాపరులతో తెలిపినప్పుడు, ఆయనను రారాజుగా గుర్తించి, తగిన ఘనతను మహిమను చెల్లించుటకు ఆశగల తమ హృదయములను వారు అనుమతించిరి.
అదే విధంగా, యేసు ఎవరని నీకు నీవుగా చూచి ఆయనను కలుసుకొనినప్పుడు, ఆయన ప్రేమ, మహిమల యొక్క పరిపూర్ణత నీ హృదయమును కృతజ్ఞతతో నింపి ఆయనను ఇంకా తెలుసుకునేలా చేయును.
ఇది చేయండి:మీకు ఇష్టమైన క్రిస్మస్ స్తుతి లేదా ఆరాధన పాటలను ఒక జాబితాగా తయారు చేయండి. వాటిని వినుటకు మీరు సమయం గడుపుతుండగా, మీ పట్ల దేవునికున్న మిక్కుటమైన ప్రేమను గూర్చి ఆలోచన చేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More