పశువుల పాకకు ప్రయాణమునమూనా
చారిత్రాత్మక విమోచన
మానవ చరిత్రంటిలో ముఖ్యమైన వంశావళి అయిన: యేసు క్రీస్తు యొక్క వంశావళితోనే మత్తయి సువార్త ప్రారంభగును. మత్తయి వ్రాసిన జాబితా కొద్దిగానే ఉన్నప్పటికి, యేసు యొక్క భూలోక సంబంధ కుటుంబమును గూర్చి మనకొక ముఖ్యమైన భాగమును చూపించును.
ఆదిమ యూదా పఠకులందరూ కూడా ఈ ప్రముఖమైన పేర్లను బాగుగా ఎరుగును. పరిశుద్ధాత్మ ద్వారా యేసు జన్మించాడనే విషయమునే కాక, చరిత్రంతటిలో వాస్తవిక వ్యక్తుల గందరగోలపు కుటుంబ చక్రములలో దేవుడు తనంతట తానుగా జ్యోక్యం కలుగజేసికున్నాడని నొక్కి వొక్కానించి చెప్పాలనుకున్నాడు. వీరులు, సమాజములో గుర్తింపునొందని సామాన్యులు, మార్గదర్శకులు, శరణార్థులు, విమోచింపబడిన వ్యభిచారులు మరియు పశ్చాత్తాపం నొందని రాజుల వంటి వారి కుటుంబము నుండే యేసు వచ్చెను.
ఈ పేర్ల జాబితాలు కుదించబడినవిగా మరియు పలుకటకు కూడా కష్టతరముగా అనిపించవచ్చు. కాని ఆ జాబితాలోనే దేవుని ప్రేమ మరియు శక్తిని కనుపరచే కథలు పొందుపరచబడి, అనేకమైన వ్యక్తుల జీవితములతో విమోచన అనే నేత నేయగా అది చివరకు యేసులో ముగించబడుతుంది.
ఇది చేయండి:గత సంవత్సరములో దేవుడు మీ కొరకు చేసిన కార్యములన్నియు వ్రాయండి. ఆయన నిన్ను కాచి కాపాడిన ప్రతి పరిస్థితికి ఆయనను స్తుతించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More