పశువుల పాకకు ప్రయాణమునమూనా
శాశ్వతమైన ప్రేమ
యేసు జన్మించినప్పటి పరిస్థితుల కంటే ప్రస్తుతపు లోక పరిస్థితులేమి పెద్దగా మారలేదు. రాజకీయ అనిశ్చత, యుద్ధములు, అణచివేత మరియు మానసిక వ్యధల వంటి సమస్యల వంటివి ఇప్పుడున్నట్లుగానే-అప్పుడు కూడా అనుదినం ఎదురయ్యే వాస్తవ పరిస్థితులుగా ఉండెను. ప్రేమ, సమాధానము, భద్రత మరియు జీవిత ఉద్దేశ్యము: వంటి వాటికొరకు ఈనాడు మనమెంతగా కోరుకుంటున్నామో ఆయన కాలములో ఉన్నవారు కూడా అంతే వెదికెడివారు.
నిజమైన సమాధానము, సంతృప్తి మరియు నిత్యము నిలిచే ప్రేమను మానవ హృదయము అనుభవించే విధంగా తనను తాను ప్రత్యేక్షపరచుకొనుటకు యేసు వచ్చెను. ఎవరైనా లోకము ఇచ్చే తృప్తి కొరకే జీవించినట్లయితే అది కేవలం ఇంతలోనే ఉండి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదని వారు ఎరిగియుందురు. మానవ ప్రేమ యొక్క ఏ అద్భుత అనుభవము కూడా హృదయాంతరంగములో గల ఆ శూన్యతను ఎంతమాత్రము నింపలేదు.
శాశ్వతమైన దానిని మనకు అందించుటకు-ప్రాణమును తృప్తి పరచే, షరతులు లేని యేసు ప్రేమ వచ్చెను. ఆయనను హత్తుకొనుట ద్వారా, ఆయన అనుగ్రహించిన ఈ ఉచిత బహుమానమును పొందుకొనగలము. చివరికి ఆ ప్రేమలోనే, మనము దేని కొరకు వెదుకుచున్నామో దాన్ని సంపూర్ణముగా పొందుకున్నాము.
ఇది చేయండి:మీ కుటుంబముతో కలిసి ఒకసారి పట్టణము చుట్టూర ఉన్న క్రిస్మస్ కాంతులను చూసి రండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More