పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఆశ్చర్యపరచే దేవుని స్వభావము
కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు ఇక ఎప్పటికి సమాధానమివ్వడు అన్నట్లు అనిపించును. మెస్సీయ యొక్క రాక కొరకు ఎదురుచూస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు కూడా అలాగే అనిపించింది. యేసు వచ్చినప్పుడు, ఆయన రాక సరైన సమయమునకు వచ్చెను. కాని చాలా మంది ఆ దేవుని గొప్ప కార్యమును ఎరుగలేదు ఎందుకనగా వారు ప్రభువును కాక - తమను మరియు తమ దేశమును హెచ్చించే మెస్సీయ కొరకే ఎదురుచూస్తున్నారు.
ఈ లోకములోనిదేది కూడా అర్పించలేనంతగా క్రీస్తు తన ప్రాణమును అర్పించుటకు వచ్చెను. అమితమైన పరలోకపు సైనిక బలగముతో ఆయన వచ్చి యుండవచ్చును కాని, క్రూరుల మధ్య ఒక పసిబిడ్డగా, తనను తాను తగ్గించుకొని వచ్చుటకు ఆయన ఎంచుకొనెను. అయినప్పటికి, ఊహలకందని ఆయన యొక్క దాసుని జీవితము, మానవజాతి పట్ల దేవునికిగల మిక్కుటమైన ప్రేమ యొక్క సంపూర్ణతను మనకు ప్రత్యేక్షపరచెను.
ఇది చేయండి: ఈ సారి మీరు బయట తినుటకు వెళ్ళినప్పుడు, అక్కడి వైటర్ కు సాధారణంగా ఇచ్చేదాని కన్నా కొంచెం ఎక్కువ టిప్ ఇచ్చి అతనిని ఆశ్చర్యపరచండి. అది వీలుకానప్పుడు, వ్యక్తిగతంగా ఒక ప్రోత్సాహకరమైన నోట్ ను వ్రాసి అతనికి ఇవ్వండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More