పశువుల పాకకు ప్రయాణమునమూనా

Journey To The Manger

70 యొక్క 7

దేవునితో అసలైన సహవాసము

ఏదేను తోట కంటే ముందే మన యెడల దేవుని ప్రేమ సంకల్పము మొదలైంది. భూపునాది మునుపే మరియు కాలానుగణంగా, మానవునితో ఆయనకు గల అసలైన సహవాసమును తిరిగి సమకూర్చుట: అనే ఒకే లక్ష్యం వైపు ఆయన క్రమముగా ముందుకు సాగెను.

ఆ తోట నుండి వారు బయటకు పంపబడినప్పుడు, ఆదాము - అవ్వలు తమ శరీరములను కప్పుకొనుటకు జంతువుల చర్మపు చొక్కాయిలు ఇవ్వబడెను. మానవుని సిగ్గును కప్పుటకు జంతువులను బలిగా అర్పించే ఈ దేవుని యొక్కకార్యము - మనకు నిజమైన మరియు సంపూర్ణ రక్షణను అందించిన - క్రీస్తు యొక్క భవిష్యత్ బలియాగమునకు ముంగుర్తుగా ఉన్నది.

యేసు ఈ లోకమునకు ఒక ప్రేమపూర్వక ఉద్దేశ్యముతో వచ్చెను. ఆయన యొక్క గొప్ప బలియాగము ద్వారా, మన సృష్టికర్తతో నిజమైన సహవాసమునకు మనము తిరిగి సమకూర్చబడ్డాము.

ఇది చేయండి: మీ సంఘములో ఎవరైనా తమ స్వంత ఇంటిలో ఉన్నట్లు అనిపించని వారున్నారా? వారు ఒంటరివారు అని అనుకొనకుండా అటువంటి వారిని మీ సంఘపు తదుపరి కూడికకు మీతో పాటు తీసుకువెళ్ళండి.

వాక్యము

రోజు 6రోజు 8

ఈ ప్రణాళిక గురించి

Journey To The Manger

2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Touch Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు https://intouch.cc/yv18 దర్శించండి

సంబంధిత ప్లాన్లు