పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఆయన మనలను ఎంతగానో కోరుకొనును
కాలారంభము కన్నా మునుపే యేసు దేవుడై ఉండెను - ఎవరి ద్వారా సమస్తమును సృజియింపబడినవో ఆ వాక్యమైయున్న వాడే యేసు. ఆయనే ఆదాము అవ్వలతోటి ఏదేను వనమందు ఉన్నవాడు. తన ప్రియమైన సృష్టికి తనకు మధ్యగల సత్సంబంధాన్నితెంపివేసిన ఆ పాపము యొక్క మొట్టమొదటి హింసాత్మకమైన గాయమును ఆయన హృదయము చవిచూసెను.
చరిత్రంతటిని చూస్తే, తన ప్రజల యొక్క పోరాటములను ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన వారిని విడిపించి, వారిని అరణ్యములో కొనిపోయెను. వారు కేవలం ఆయననే కోరుకుంటారని ఆయన ఎంతగానో ఆశించెను కాని, వారి హృదయములు ఆయనకు బహు దూరమై, మానవుడు చేసిన వట్టి విగ్రహములనే వారు ఆరాధించిరి.
సంవత్సరముల తరబడి పరలోకపు గుమ్మము వద్ద నుండి యేసు అలా చూస్తూ ఎలా ప్రార్థిస్తూ ఉండే వాడో ఒక్కసారి ఆలోచించుము. కావున సమయము సంపూర్ణమైనప్పుడు, ఆఖరికి ఆయన మన రక్షకునిగా మన వద్దకు వచ్చేటప్పుడు ఆయన సంతోషమును పరిగణించండి.
ఇది చేయండి: చక్కటి సహవాసము కొరకు, మంచి స్వీట్లను సిద్ధపరచి కొంతమంది పొరుగువారిని ఆహ్వానించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More