పశువుల పాకకు ప్రయాణమునమూనా
శరీరధారి అగుట
మైఖేల్ ఎంజెలో యొక్క ఉత్తమ కళాఖండమైన సిస్టిన్ మందిర పైకప్పు మీది చిత్రములలో ఆదాము యొక్క సృష్టి చాలా ప్రాముఖ్యత గావించిన భాగము. ఆదాము బండ మీద ఆనుకొని ఉండంగా, దేవుడు మేఘారూరుడై వస్తున్నట్టుగా మరియు సృష్టింపగలిగిన తన వ్రేలును మొదటి మానవుని వైపు చూపించు చుండెను. ఆదాము తన చేతిని దేవుని వైపు చూపించు చుండగా, వీరి చాపబడిన వ్రేళ్ళు కలిసికొన్నట్లుగానే అనిపించినా - అవి కలిసికొనవు.
ఈ చిత్రమును దేవుడే మానవునిగా అవతరించిన దానితో పోల్చి చూడండి: తన సృష్టితో దగ్గరవ్వటానికే కాక, పరిపూర్ణ దైవమైనప్పటికి పరిపూర్ణ మానవునిగా మన వలె నివసించుటకు దేవుడు శరీరధారి ఆయెను. "శరీరధారి" అన్న పదము మనకి ఒక వేదాంతపరమైనదిగా కనిపించినప్పటికి, అది వాస్తవానికి మానవునితోటి అత్యంత సాన్నిహిత్యాన్ని సూచించును.
ప్రతి విషయంలో మనతో సహానుభవము గలవాడగుటకు - యేసు ఒక పసికందుగా, తర్వాత ఒక పిల్లవానిగా, పిమ్మట ఒక యవ్వనస్థునిగా, అటు పిమ్మట ఎదిగిన వ్యక్తిగా ఆయెను. ఏ అర్పణము కూడా ఆయనతోటి సాటి రాలేదు.
ఇది చేయండి:ప్రకృతితో ఏకాంతముగా కొంత సమయము గడపండి. మీరున్న పరిస్థితిలోనే యేసుని భూసంబంధమైన జీవితం ఆయనను ఏ విధముగా మీతో పోల్చదగునో కొద్ది క్షణములు ఆలోచించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More