పశువుల పాకకు ప్రయాణమునమూనా
వెలుగు జయించును
లోకమును ఆత్మీయ అంధకారము కమ్మినవేళలో యేసు యొక్క జననము అవతరించెను. ఇశ్రాయేలు ప్రజలకు అన్నీ ఉన్నప్పటికి దేవుని మార్గములను మరచినవారుగా ఉన్నారు. మందిరము ఒక వ్యాపార స్థలమాయెను; అర్పణలను దేవునిని ఆరాధించాలనే అంతరంగపు తృష్ణతో కాక కేవలం ఒక ఆచారముగా మరియు ఒక బాధ్యతగా మాత్రమే అర్పించుచున్నారు. మెస్సీయ రాకను గూర్చిన నిరీక్షణ కేవలం రోమా పెత్తందారుల పతనము కొరకు మరియు సైనిక రక్షణ కొరకైన ఒక లోకాశగా మాత్రమే వారికి ఉన్నది.
కాని వారి ఆలోచనలకు పూర్తి భిన్నంగా యేసు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో వచ్చెను. నిజానికి, ఆయన శత్రువు యొక్క క్రియలను నాశనము చేయుటకే వచ్చెను - ఆ శత్రువు మన ఆత్మలకు శత్రువైన వాడు. సమస్త మానవాళి కూడా సమృద్ధియైన, యథార్థవంతమైన జీవితమును పొందాలని - ప్రేమ మరియు క్షమాపణలకు గుర్తుగా తన ప్రాణమునే అర్పించి తన రాజ్యమును ఈ భూమి మీద స్థాపించెను.
ఇది చేయండి:ఎవరో ఒకరి జీవితమును వెలిగించుము - కొంత మంది స్నేహితులతో కలిసి కారేల్స్ కు వెళ్ళండి. నీ పొరుగువారితో కుదరక పోయినట్లయితే, వేరొక సహాయక సమాజము ద్వారా ప్రయత్నించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More