పశువుల పాకకు ప్రయాణమునమూనా
ఇమ్మానుయేలు
పాత నిబంధన ప్రవక్తలకు తమ మాటలు ఎప్పుడు నెరవేరునో తెలియదు కాని; కేవలం దేవుని ఆత్మ వారికి ఏమి చూపెనో వాటిని పొందుపరుచుకుంటూ వెళ్ళారు. "కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును" (మత్తయి 1:23; మూల వాక్యం యెషయా 7:14) అని యెషయా వ్రాసినపుడు, అది ఎప్పుడు నేరవేరుతుందో అతనికెంత మాత్రము తెలియదు.
ఇమ్మానుయేలు అనగా "దేవుడు మనకు తోడు" అని అర్థము. ఏదేను తోటలో మానవుడు కొల్పోయిన ఆ సాన్నిహిత్యమును తిరిగి పునఃస్థాపనకు భూమి మీద యేసు యొక్క ప్రత్యేక్షత తొలి మెట్టుగా ఉన్నది. ఆయన జీవమే దేవునికి మన యెడల గల వ్యక్తిగత ప్రేమా స్వరూపము. కొన్ని వేల సంవత్సరముల క్రితం యెషయా ద్వారా లోకమునకు ప్రభువు అందించిన వాగ్దానము యొక్క నెరవేర్పు నందు జీవించే ఆ గొప్ప ఆశీర్వాదములో ఈనాడు మనమందరము ఉత్సాహించుచున్నాము.
ఇది చేయండి:ఆయన సన్నిధిలో సంతోషించండి. మీకిష్టమైన క్రిస్మస్ చిత్రమును చూడండి, దాని ద్వారా దేవుని స్వభావమును గూర్చి క్రొత్తగా ఏదైనా ప్రత్యక్ష పరుచుమని పరిశుద్ధాత్ముని అడగండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More