పశువుల పాకకు ప్రయాణమునమూనా
యేసే దేవుని వాగ్దానపూర్ణుడు
మెస్సీయ యొక్క రాకను ప్రవక్త వెంబడి ప్రవక్త ముందుగానే చెప్పుకుంటూ వచ్చెను. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆచారములు మరియు పండుగలలో చాలా మట్టుకు ఆయన రాకడకు ఛాయగా పోల్చబడియున్నవి. అయినా శతాబ్దములు దాటిపోతున్నప్పటికి, వాగ్దానపూర్వకమైన ఆ దైవిక జోక్యము కలుగక, కాలము యథావిధిగా జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. తన ప్రజలకు దేవుని మాటలు కేవలం వట్టి వాగ్దానాలుగానే మిగిలిపోయినట్లా? ప్రవక్తలందరూ అబద్ధికులైనట్లా? మానవుడు ఆ పాపపు మరియు దాస్యపు సంకెళ్ళలో బందిగానే ఉండిపోవాలా?
అటువంటి కాలములో, అన్ని దినములవలెనే ఒకనాడు, మానవజాతి యొక్క గమ్యమును మార్చుటకు ఒక చిన్న పిల్లవాని రూపములో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దైవిక జోక్యము కలిగెను. అప్పటి వరకు ఆయన కొరకు వేచి చూస్తున్న వారికోసము, ఎటువంటి ఆర్భాటము లేకుండా యేసు చాలా నిశ్శబ్దముగా వెంచేసెను. కాని ఆయన జన్మదినమున, ఈ లోకము వింతైన మార్పునొందెను. ఇది వరకున్నట్లుగా ఇక ఎన్నటికి ఉండదు.
ఇది చేయండి:నీ సాక్ష్యము మీద ధ్యానించుము. నీవు యేసును అంగీకరించిన తర్వాత నీ జీవితం ఎలా మార్పు నొందిందో కొన్ని ప్రత్యేక విషయములను వ్రాయుము. వాటిని నీ తోటి విశ్వాసి యొక్క విశ్వాసమును పురిగొల్పి వారిని అధికమైన విశ్వాసములోనికి నడిపించునట్లుగా వారితో పంచుకొనుము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
2000 సంవత్సరముల క్రితం, ఒకానొక నిశ్శబ్ద రాత్రి వేళ, రక్షకుని జననమును గూర్చిన వార్తను దూతలు, మందలను కాయుచున్న గొర్రెల కాపరుల యొద్దకు మోసుకొని వచ్చెను. ఆ వార్తను వినిన పిమ్మట, ఆ కాపరులు సమస్తమును విడిచిపెట్టి, బెత్లెహేములో పశువుల పాకలో నున్నఒక బాలుని వెదకుటకు బయలువెళ్ళెను. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఆ ఆహ్వానము మార్పు చెందలేదు. డా. చార్లెస్ స్టాన్లీ గారితో కలిసి, ఆ రక్షకుని దగ్గరగా చేరుటకు నీకు సహాయపడుతూ మరియు ఈ క్రిస్మస్ వేళలో తండ్రి ప్రేమలో ఒదిగి విశ్రాంతి తీసుకొనుటకు వీలు చేసుకకొనుమని ఆయన నిన్ను ప్రోత్సహించును
More