దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

10 యొక్క 3

ధృడంగా నిలబడిండి

బైబిల్ కథ – స్టీఫెన్ మరణం "ఆక్ట్స్ 6:8-15, 7:51-60"

దేవుని కవచము మరియు ఆక్ట్స్ యొక్క పుస్తకము చదువుతున్నప్పుడు, మనము దానిలోనే జీవిస్తున్నట్లు దేవుని కవచాన్నిధరించామని గుర్తించటం ముఖ్యము. నిజం యొక్క బెల్టును పెట్టుకోవడానికి ప్రార్ధన చేయలేరు. నిజాన్ని నోటితో చెప్తున్నప్పుడు, మరియు దేవుని నిజాన్ని గుండెలో నమ్ముతున్నప్పుడు, మీ నిజం యొక్క బెల్ట్ పెట్టబడి ఉంటుంది. మీ విశ్వాసం యొక్క డాలును తీసుకోవడానికి కూడా మీరు ప్రార్ధన చేయలేరు. మీరు విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు, మనుష్యులు చెప్పినది కాకుండా దేవుడు చెప్పినది నమ్మినప్పుడు, మీ విశ్వాసం యొక్క డాలు మీ చేతిలో ఉంది మరియు మీ శత్రువుకు వ్యతిరేకంగా దానిని ఉపయోగిస్తున్నారు. ఇదే నియమము మీరు ధృడంగా నిలబడటానికి కూడా వర్తిస్తుంది. ధృడంగా నిలబడటానికి ప్రత్యేక వాక్యాలతో ప్రార్ధించలేరు. దేవుని విశ్వసిస్తూ విడిచిపెట్టటానికి తిరస్కరిస్తూ, మీరు ధృడంగా నిలబడ్డారు.

ఆక్ట్స్ యొక్క పుస్తకం నుండి ఈ రోజు బైబిల్ కధలో స్టీఫెన్ గొప్ప ఉదాహరణ. అతను నీతిమంతుడు మరియు తెలివైనవాడు, అతని కవచాన్ని నిరంతరం ధరించేవాడు. అతనికి వ్యతిరేకంగా మత వ్యతిరేకత చెలరేగినప్పుడు, దాని వలన మరణం ఖచ్చితమని తెలిసినా, అతను నమ్మిన దానిపై ధృడంగా నిలబడేవాడు.

ఏసు క్రీస్తు గురించి బోధిస్తున్నందు మత పెద్దలు అతనిపై ఎంత కోపంగా ఉండేవారంటే గుంపుని హింసకి ప్రేరేపించి చివరకు స్టీఫెన్ ను రాళ్ళతో కొట్టి చంపారు. ఈ కథ మొత్తంలో తాను నమ్మిన దానిపై స్టీఫెన్ ధృడంగా నిలబడ్డాడు, మరియు ప్రజల అభిప్రాయం ఆధారంగా తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.

మీరు దేవుని నమ్ముతూ దాని కోసం పీడించబడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీరు ధృడంగా ఉన్నారు, మరియు దేవుని కవచాన్ని ధరించి గట్టిగా నిలబడ్డారు!

"నేను ధృడంగాఉండాలని ఎంచుకున్నాను.”

ప్రశ్నలు :

1.మానవ జీవితం యొక్క ఒడిదుడుకులు ఏమిటి?

2. సైతానుకి వ్యతిరేకంగా మనము ఎప్పుడు నిలబడాలి?

3. ధృడంగా నిలబడటానికి మనము తీసుకోవలసిన అతి ముఖ్యమైన చర్య ఏమిటి?

4. అబద్ధ ఆరోపణలు ఎదుర్కున్నప్పుడు దేవదూతలాంటి ముఖం కలిగి ఉన్నవారు ఎవరు?

5. చనిపోయేముందు అతను ఏమి అన్నాడు?

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/