దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

10 యొక్క 4

నిజము యొక్క బెల్ట్

బైబిల్ కధ – అననియస్ మరియు సఫీరా "ఆక్ట్స్ 5:1-10"

ఎఫీసియన్స్ అధ్యాయం 6 లో ప్రస్తావించబడిన మొదటి కవచం నిజం యొక్క బెల్టు, ఇది సైనికుని నడుము చుట్టూ ఉండి మొత్తం కవచాన్ని సరైన స్థానంలో ఉంచుతుంది. సైనికుని కవచాన్ని పట్టుకుంటుంది, కత్తిని స్థానంలో ఉంచుతుంది, మరియు ఇది సైనికుడు ఎప్పుడూ తీయని వాటిలో ఒకటి. నిజానికి, ఒక సైనికుడు నిజం యొక్క బెల్టుని కలిగి ఉండకపోతే, బహుశా వారి దుస్తులు జారిపోవచ్చు, మరియు అందరి ముందు ఇబ్బంది పడవచ్చు!

మన నోటి నుండి వచ్చేది నిజంలోని ఒక భాగము. దేవునికి, మన తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పకుండా నిజాలే మాట్లాడే క్రైస్తవులము కావాలి. కానీ నిజం యొక్క బెల్టు ఇంకొక భాగము మనము దేవుని మరియు అతని మాటను విశ్వసించటము. నిజం ఏమిటంటే మన శత్రువు, దెయ్యం, ఎల్లప్పుడోఓ నిజాలు కాని వాటిని మన చేత నమ్మించేలా చేయటానికి మోసం చేయటానికి అబద్ధాలు చెప్పటానికి ప్రయత్నిస్తుంది

ఈ రోజు బైబిల్ కధలో, అననియాస్ మరియు సప్ఫీరా, వారు శిష్యులతో నిజాయితీగా ఉంటే ముఖ్యము కాని ఒక అబధ్ధాన్ని విశ్వసించారు. వారు అందుకున్న సొమ్ము కంటే తక్కువ సొమ్ముకు వారి ఆస్తిని అమ్మినట్లు నటించారు. దేవుడు చూడలేడని లేదా అమ్మకం యొక్క వివరాలు తెలుసుకోలేడని అనుకునేలా చేసిన శత్రువు మాటలు వారు నమ్మారు. కానీ దేవుడు అన్నీ చూస్తాడు. శిష్యులు దేవుని ప్రతినిధులు. వారు శిష్యులకు అబద్ధం చెప్పినందుకు, వారు దేవునికి కూడా అబద్ధం చెప్పారు. దెయ్యం వారి చెవిలో చెప్పిన అబద్ధాలను నమ్మినందువలన వారు అమ్మకం గురించిన నిజాన్ని దాచిపెట్టారు. మీ కవచం పడిపోవడానికి ఏ అబద్ధాలు కారణం కావచ్చని మీరు నమ్ముతున్నారు?

దేవుడు మరియు అతని మాటల పట్ల నిజాన్ని నమ్మి ఎల్లప్పుడూ నిజాన్ని చెప్పడం ద్వారా నిజం యొక్క బెల్టును మనము ధరించటము ముఖ్యము.

"నేను నిజాయితీగా జీవించటాన్ని ఎంచుకున్నాను.”

ప్రశ్నలు:

1. మీరు నిజాయితీగా ఉండకపోతే, మీ నిజం యొక్క బెల్టుకు ఏమి అవుతుంది? ఇది మీ కవచంలోని ఇతర భాగాలను ప్రభావితం చేస్తుందా?

2. మీరు ‘అబద్ధం’ చెప్పలేదు కానీ ‘నిజాయితీ’ గా లేరు అటువంటి ప్రత్యేక పరిస్థితి ఏది?

3. అబద్ధం చెప్పటం వలన ఫలితం ఏమిటి?

4. మూడు గంటల తేడాతో వారు పీటర్ తో మాట్లాడినా అననియాస్ మరియు సప్ఫీరా ఇద్దరూ వారి ఆస్తి అమ్మకం గురించి ఒకే కధ ఎలా చెప్పారు?

5. అననియాస్ మరియు సప్ఫీరా ఎవరికి అబద్ధం చెప్పారు? ఈ రోజు ప్రజలు అబద్ధం చెప్తే, వారు ఎవరితో అబద్ధం ఆడుతున్నారు

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/