దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా
కనిపించని ప్ర పంచం
బైల్ కధ – ఏసు స్వరా్గ నికి ఆరోహణమయా్యరు " ఆక్ట ్స్ 1:1-11 "
మన చుట్టూ ఒక కనిపించని ప్రపంచం ఉంది మరియు మనము చూడలేకపోయినప్పటికీ అది ఎంతో వాస్తవమైనది. గాలిని నీవు చూడలేవు కానీ ఆకుల గుండా గాలి వీస్తున్నప్పుడు చెట్ల కదలికని నీవు ఎలా చూడగలవో అలాగే, అంటే అది ఆధ్యాత్మిక ప్రపంచం. పాత నిబంధన యొక్క ఒక ప్రవక్త, ఎలిషా, ఈ కనిపించని ప్రపంచాన్ని చూడటానికి ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చారు. ఆరమ్ మరియు ఇజ్రాయిల్ మధ్య పోరాటం ప్రారంభం కాబోతున్నది. (2 రాజులు 6:8-23)6:8-23) ఒక రాత్రి, శత్రు సైనికులు నగరాన్ని చుట్టుముట్టారు, మరియు ఎలిషా యొక్క సేవకుడు వారిని చూసినప్పుడు, చాలా భయపడ్డాదు. కానీ ఆ ప్రవక్త అక్కడ కంటే ఎక్కువ మంది శత్రువులు మనతోనే ఉన్నారు భయపడవద్దని చెప్పాడు. సేవకుడి కళ్ళు తెరిపించమని ఎలిషా ప్రార్ధించాడు, మరియు అప్పుడు అతను తమ చుట్టూ కొండలు గుర్రాలు మరియు అగ్ని రధాలతో నిండి ఉండటం చూశాడు! తన ప్రవక్త ని రక్షించటానికి దేవుడు కనిపించని పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నాడు!
మనము చూడలేకపోయినా, మన చుట్టూ ఆధ్యాత్మిక పోరాటం జరుగుతూ ఉంటుంది. సైతాను ఉనికిలో ఉన్నాడని, ఆధ్యాత్మిక రాజ్యం యొక్క వాస్తవాలను మనము నిర్లక్ష్యం చేసేలా ప్రయత్నిస్తున్నాడని బైబిల్ స్పష్టం చేసింది. ఆక్ట్స్ పుస్తకం నుండి, ఈ రోజు బైబిల్ కధ, ఏసు స్వర్గానికి తీసుకుపోబడ్డాడు. నన్ను దయచేసి నమ్మండి, స్వర్గము మరియు నరకము నిజమైనవి. ఈ నిజమైన చారిత్రక సంఘటనలో, ఏసు అవరోహణ తరువాత, ఇద్దరు దేవదూతలు శిష్యులకు కనపడతారు! దేవదూతలు సహాయం చేయటము లేదా దెయ్యం మనపై దాడి చేయటము నమ్మటం మనకి కష్టం, కానీ మనము చూసే వాటికంటే ఈ విషయాలు చాలా వాస్తవం. దేవుని కవచం యొక్క ఈ అధ్యయనానికి వెళ్దాము మరియు కనిపించని ప్రపంచం గురించి మరింత తెలుసుకుందాము.
మనము ఇష్టం ఉన్నా, లేకున్నా మనము యుద్ధంలో ఉన్నాము. అందువలన శత్రువుతో పోరాడటానికి దేవుని యొక్క పూర్తి కవచాన్ని ధరిద్దాము!
"ఈ కనిపించని ప్రప్రంచాన్ని నమ్మాలని మరియు దేవుని పూర్తి కవచాన్ని ధరించాలని నేను ఎంచుకున్నాను."
ప్రశ్నలు :
1. మంచి మరియు చెడుల రెండు ప్రపంచాలు ఉనికిలో ఉన్నాయనటానికి ఏ సాక్ష్యాన్ని మీరు చూశారు?
2. తప్పులు చేసి దేవుని కవచంతో రక్షించబడని ఇతరులను మీరు చూశారా?
3. మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక పోరాటం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
4. ఏసు వెళ్ళినట్లే తిరిగి వస్తాడని ఎవరు వాగ్దానం చేశారు?
5. ఆక్ట్స్1:8 నుండి తీసుకున్న ఖాళీని పూరించండి: మీరు దీనిలో నా సాక్ష్యులుగా ఉంటారు … ____________________________________. ఈ రోజు మనకి దీని అర్ధం ఏమిటి?
ఈ ప్రణాళిక గురించి
దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/