దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

10 యొక్క 10

ఆపకుండా ప్రార్ధించండి

బైబిల్ కథ – పీటర్ జైలు నుండి తప్పించుకుంటాడు "ఆక్ట్స్ 12:1-19 "

శత్రువుకి వ్యతిరేకంగా రక్షణ కోసం మనము ఉపయోగించగలిగిన రెండవ ఆయుధం ప్రార్ధన. దీనిని రక్షణగా కూడా ఉపయోగించవచ్చు. ప్రార్ధనలతో మనము పోరాటాలు చేయవచ్చు, ముందుకు ఎలా కొనసాగాలో ప్రభువు నుండి జ్ఞానం పొందవచ్చు, మన కోసం పోరాడటానికి స్వర్గంలో దేవదూతలను విడుదల చేయవచ్చు, మరియు మనము దేనికి వ్యతిరేకమో మెరుగ్గా అర్ధం చేసుకోవచ్చు.

ఈ రోజు బైబిల్ కధలో, మొత్తం చర్చి అతని కోసం ప్రార్ధన జరుపుతున్నప్పుడు పీటర్ చర్చిలో ఉండటం మనము చూశాము. వారు ప్రార్ధిస్తుందగా, పీటర్ ను విడిపించటానికి ప్రభువు ఒక దేవదూతను జైలుకు పంపాడు! దేవదూత అతనిని జైలు బయటకు వీధిలోకి తీసుకువెళ్తుంది మరియు సోదర, సోదరీమణులు ప్రార్ధిస్తున్న ఇంటికి పీటర్ తిరిగి వస్తాడు. అది నిజంగా పీటర్ అని నమ్మకం లేక వారు అతని కోసం తలుపు కూడా తెరవరు! అతని విడుదల కోసం వారు ప్రార్ధిస్తున్నారు, కానీ అది నిజంగా జరిగినప్పుడు మనము నిర్ఘాంతపోతాము! చాలాసార్లు, నీవు మరియు నేను ప్రార్ధిస్తాము, కానీ మన ప్రార్ధనలకు దేవుడు సమాధానం ఇచ్చి సహాయం చేయటానికి వచ్చినప్పుడు మనము ఆశ్చర్యపోతాము. ప్రార్ధన్ చేయమని మరియు సహాయం చేస్తానని అతను వాగ్దానం చేస్తాడు. మీరు ప్రతి రోజూ ఉపయోగించాలంటే, ఈ కవచం యొక్క భాగాన్ని మీరు రోజూ చేయాలి.

ప్రార్ధన అన్నిటినీ మార్చుతుంది! మీ పోరాటంలో నిరంతరంగా ప్రార్ధించండి ఎందుకంటే ఎప్పటికంటే ఎక్కువగా ఈ రోజు యుద్ధంలో మనకి అవసరము.

" యుద్ధం ఆధ్యాత్మికమైనదని గుర్తు చేసుకుంటూ, ఎల్లప్పుడు ప్రార్ధించటాన్ని నేను ఎంచుకుంటాను"

శ్నలు:

1. “దేవుని కవచం” లో ప్రార్ధన ఎందుకు పొందుపరచబడింది?

2. శత్రువుల నుండి రక్షణ కోసం చేసే ప్రార్ధనకి ఉదాహరణ ఏమిటి మరియు శత్రువుపై దాడి చేయటానికి ప్రార్ధించటానికి ఉదాహరణ ఏమిటి?

3. దేవుడు ప్రతిదానిపై నియంత్రణ కలిగి ఉంటే, ఏమి జరుగుతుందో ఆయనకి ఇప్పటికే తెలిసి ఉంటే, అతన్ని ప్రార్ధించమని మనల్ని ఎందుకు అడుగుతాడు?

4. మనము ఉపయోగించే రెండు ప్రమాదకర ఆయుధాలు ఏవి?

5. పీటర్, మేరీ ఇంటి తలుపు తట్టినప్పుడు తలుపు వద్దకు ఎవరు వచ్చారు?

ఈ పాఠ్యప్రణాళికను ఎక్విప్ & గ్రో యొక్క పిల్లల పాఠ్యప్రణాళిక నుండి తీసుకోబడింది, అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.ఇంట్లో ఈ ప్రణాళికనుబట్టి ఆనందించండి, ఆపై విద్యార్థి పుస్తకాలు, ఆటలు, హస్తకళలు, పాటలు, అలంకరణలతోపాటు, మరెన్నో సంఘంలో పూర్తి పాఠ్యప్రణాళికను చేయండి!

https://www.childrenareimportant.com/telugu/armor/

రోజు 9

ఈ ప్రణాళిక గురించి

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/