దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా
బైబిల్ కధ
పాల్ మరియు సిలాస్ జైలులో "ఆక్ట్స్ 16:16-31"
మనము మనుష్యులకు వ్యతిరేకంగా పోరాడము కానీ దెయ్యము మరియు అతని చీకటి రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడతాము. దెయ్యానికి అపార్ధాలు సృష్టించటము ఇష్టము మరియు ఒకరిని ఒకరు కష్టపెట్టడానికి వ్యక్తులను ఉపయోగించుకోవచ్చు, కానీ మన పోరాటము అతనికి వ్యతిరేకంగా అని మనము గుర్తు ఉంచుకోవాలి! మన ప్రపంచము పతనమైన ప్రదేశము, మరియు మనుష్యులుగా మనము, ఒకరి పట్ల ఒకరం పాపాలు చెస్తాము. కానీ ఒకరితో ఒకరు పోట్లాడకూడదని గుర్తించుకోవాలి, ఎందుకంటే ఇది శత్రువు వలలో పడటము.
మనము తప్పులు చేసినా, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. మనము వేరే వారిపై దయ చూపగలిగేలా, మనము తప్పు చేసినప్పుడు, మన సొంత జీవితంపై దేవుడు చూపిన కరుణకి మనము కృతఙ్ఞులము అయి ఉండాలి. కొన్నిసార్లు శత్రువులు మనకి ఒకరిపై ఒకరికి కోపం వచ్చేలా మన మాటలు లేదా చర్యలను వక్రీకరిస్తారు. అయినప్పటికీ, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందుకే మనము కూడా ప్రేమించాలి.
ఆక్ట్స్ పుస్తకం నుండి ఈ రోజు బైబిల్ కధ, పాల్ మరియు సిలాస్ జైలులో వేయబడ్డారు. వారు ఏమీ చేయక పోయినా గార్డులు వారి పట్ల క్రూరంగా ఉన్నారు. అయినప్పటికీ, దేవుడు వారికి పారిపోయే దారి ఇచ్చినప్పుడు, వారు గార్డులపై పగ తీర్చుకోలేదు, బదులుగా వారిపై దయ చూపారు, గార్డుకి మరియు అతని కుటుంబానికి దేవుని వైపుకు దారి చూపారు! పాల్ మరియు సిలాస్ వారి పట్ల గార్డు చేసిన చెడుకి నిందించవచ్చు, కానీ పోరాటం దెయ్యం మీద కానీ ప్రజల మీద కాదని వారు గుర్తు చేసుకున్నారు.
దేవుని కవచం ధరించిధరించి మనము ఆధ్యాత్మిక తిమిరం పైన కానీ తోటి మనుష్యుల మీద కాదని గుర్తు ఉంచుఉంచుకోవాలి!
"నా చుట్టూ ఉన్న మనుష్యులతో కాకుండా, శత్రువుకి వ్యతిరేకంగా పోరాడటాన్ని నేను ఎంచుకున్నాను.”
ప్రశ్నలు :
1. ఈ పదాల అర్ధం ఏమిటి? “”శక్తులు, అధికారాలు, మరియు బలాలు, ఈ చీకటి ప్రపంచాన్ని మరియు చెడు ఆధ్యాత్మిక శక్తులను అదుపు చేసేవి.” ఎఫీసియన్స్ 6:12
2. చీకటి ప్రపంచానికి వ్యతిరేకంగా కాకుండా మనుష్యులకి వ్యతిరేకంగా పోరాడిన ఉదాహరణలు కొన్ని ఏవి?
3. దేవుని కవచం గురించి మనము తెలుసుకోవాలని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు?
4. జైలు లోకి తోయబడే ముందు పాల్ మరియు సిలాస్ లకు ఏ బాధారమైన విషయము జరిగింది?
5. “నేను రక్షించబడాలంటే ఏమి చేయాలి?” అనే జైలర్ ప్రశ్నకి సమాధానం ఏమిటి.
ఈ ప్రణాళిక గురించి
దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/