దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

10 యొక్క 6

శాంతి యొక్క సువార్త బూట్లు

బైబిల్ కథ – ఫిలిప్ మరియు ఎథియోపియన్ "ఆక్ట్స్ 8:26-40"

వెళ్ళటానికి సిద్ధంగా మన బూట్లు ధరించటానికి ఇదే సమయము! మనము సువార్త పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, లేదా ఏ క్షణంలో అయినా పాటించటానికి సిద్ధంగా ఉన్నామని, లేదా మంచి చెయ్యటానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని దీని అర్ధం.

మనము పాదాలకు వేసుకునేవి మన నిలకడని మరియు చైతన్యాన్ని నిర్ణయిస్తాయి. మనము వేసుకునే బూట్లు మనము సౌకర్యంగా ఎంత దూరం నడవగలమో లేదా పరిగెత్తగలమో అనే దాని పై ప్రభావం చూపుతాయి. సరిగా ఎంచుకోని పాదరక్షలు మనల్ని అవిటివారిని చేయవచ్చును, మందకొడిగా చేయవచ్చు, మరియు లైన్ ఆఫ్ మార్చ్ నుండి మనల్ని పడిపోయేలా చేయవచ్చు. ఉత్తి పాదాలతో ఉన్న సైనికుడు నిజమైన ఇబ్బందిలో పడవచ్చు. యుద్ధంలో మనము ఎక్కడ అడుగువేస్తామో అనేది మనము ఆలోచించవలసిన చివరిది. బూట్లు మనలను భయం లేకుండా స్వేచ్చగా అడుగు వేసేలా చేస్తాయి తద్వారా మనము పూర్తి దృష్టిని చేతిలోని యుద్ధంపై పెట్టవచ్చు. ప్రపంచం మొత్తం అతని శాంతి మార్గాన్ని వ్యాపింపజేసే, దేవుని రాజ్యం యొక్క మంచి వార్తను ప్రకటించటానికి, ఏసు శరీరం పంపబడినది. మన బూట్లను ధరించి, ఇతరులకు ఆ మంచి వార్తను వ్యాపింపజేయడానికి, కదలటానికి మనము సిద్ధంగా ఉన్నాము.

ఆక్ట్స్ పుస్తకం నుండి సువార్తను ప్రకటించటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఫిలిప్ కధ చాలా గొప్పది. ఎక్కడనుంచో దేవదూత అతన్ని లేచి వెళ్ళమంటుంది, నగరంలో ఏ వీధికి వెళ్ళాలో నిర్దిష్ట దిశలను చెప్తుంది. అతను అక్కడకి చేరుకున్నప్పుడు, ప్రభువు ఒక ప్రత్యేక వాహనము వద్దకు పరిగెత్తమని చెప్తాడు. అతను చదువుతున్న పుస్తకము అర్ధం అవుతుందా అని ఫిలిప్ ఆ మనిషిని అడుగుతాడు, కారులోకి ఆహ్వానించబడతాడు, మరియు సువార్తని పంచుకోవడానికి కదులుతాడు. ఆ ఇథియోపియం క్రీస్తును ఎంచుకోవాలని నిర్ణయించుకుంటాడు మరియు అక్కడికి అక్కడే బాప్టిజం తీసుకోవడానికి కారును ఆపుతాడు! ఫిలిప్ అతనికి బాప్టిజం ఇస్తాడు, కానీ వారు నీటి వరకూ వచ్చినప్పుడు, ఫిలిప్ మాయమవుతాడు! మరొకచోట సువార్తను బోధించటానికి ప్రభువు ఆత్మ ఫిలిప్ ని వేరే చోటకి తీసుకువెళ్ళింది.

సువార్తను పంచుకోవడానికి ఇష్టంగా & మరియు సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి అద్భుతమైన వాస్తవ కథ ఇది!

“దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలని మరియు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండాలని నేను ఎంచుకున్నాను.”

ప్రశ్న:

1. ముందస్తుగా సిద్ధం అవకుండా, అకస్మాత్తుగా మీరు సువార్తను పంచుకోవలసిన అవసరం వస్తుంది?

2. ముందుగా హెచ్చరిక లేకుండా తరగతిని నడిపించవలసి వస్తే, మీరు ఏ అంశాన్ని బోధిస్తారు?

3. భయం యొక్క సువార్తతో పోలిస్తే “శాంతి” యొక్క సువార్త అంటే ఏమిటి?

4. ఇథియోపియన్ ఫిలిప్ ని ఏమి అడిగాడు?

5. ఇథియోపియన్ వీటిని చూసినప్పుడు, అతను ఏమి కోరాడు?

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/