ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణమునమూనా
మీ తదుపరి తరం యొక్క వారసత్వం ఎలా ఉండబోతుంది?
"ఏ తండ్రి ఉత్సాహంతో దేనిని కొనసాగిస్తాడో, దానిని తన పిల్లలు మితంగా అనుసరిస్తారు. ఏ తండ్రి దేనిని మితంగా అనుసరిస్తాడో, దానిని తన పిల్లలు పట్టించుకోరు . . . మరియు మీ మనవసంతానము ఏమి చేస్తారో చూసేవరకు మీరు ఎలా కొనసాగించారో మీకు తెలియదు!"
నేను మొట్టమొదటిసారి ఈ విధంగా ఒక ప్రసింగీకుడు చెప్పిన విషయాన్ని వినినప్పుడు, నా రోమాలు నిక్కబోడిచి నట్లయింది. ఎలప్పుడు ఇది నిజం కాకపోవచ్చు. కాని లేఖనముల నుండి అనేక ఉదాహరణములు ఉపయోగించెను.
అబ్రహాము. అమ్ముడుపోయెను. విధేయుడాయెను. ఒక క్రొత్త పదమును కనుగొనెను.విశ్వాసము. తన కుమారుడైన ఇస్సాకు? ఖచ్చితంగా ఒక దైవికమైన వ్యక్తి, కాని దేవుని సూచనలకు వ్యతిరేకముగా ఐగుప్తు పయనమయ్యే విషయాన్ని చూస్తాము. ఆ సమయంలోనే, తన తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చేసిన పాపమును అతను కూడా అనుకరిస్తూ తన భార్యను తన సోదరిగా విడిచిపెట్టాడు.
మీరు వారి పిల్లల పిల్లల చరిత్రను వెదికినప్పుడు ఆ ప్రసంగీకుని యొక్క సిద్ధాంతం నిలబడుతుందా?
ఇస్సాకు పిల్లలు, యాకోబు మరియు ఏశావు దైవికమైన వారే. కాని జ్యేష్టత్వపు హక్కును పొందుకొనుటకు యాకోబు ఉపయోగించిన మోసమును గూర్చి ఏమనిపిస్తుంది? మరియు ఒక గిన్నెడు వంటకం కోసం దాన్ని మార్చుకోవటానికి ఏశావు యొక్కతొందరపాటును గూర్చి ఏమనిపిస్తుంది?
విషయమేమిటంటే తండ్రులమైన మనము ఖచ్చితంగా దేవునిని ఆసక్తితో వెంబడించాలే కాని, ఏదో నామమాత్రముగా కాదు. మన విశ్వాసము మనకు ఎంత ప్రాముఖ్యమో అన్న దానిని చూస్తూ, మన పిల్లలు తమ విశ్వాసము వారికి ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని తమ హృదయాలలో ముందుగానే నిర్ణయించుకుంటారు.
ఎటువంటి అవకాశాలను తీసుకోకండి. అన్నిటిని ఉపయోగించండి. ఎటువంటి ఖాళీలు లేకుండా, యేసునకే సంపూర్తిగా అమ్ముడుపోయిన, ఆయన అనుచరుడిగా ప్రార్థన, దశమ భాగము, ప్రేమ, దయల విషయంలో ఒక బహిరంగమైన నిర్ణయం తీసుకోండి.
కనీసం ఈనాటి నుండైనా, దేవునిని అనుసరించుటలో ఆసక్తిగల వానిగా ఉండండి. ఇక మీదట ఏ ఒక్కరు కూడా మిమ్మును నామమాత్రము వారని అనకుండా చూసుకోండి.
తద్వారా మీ మనవ సంతానమునకు ఒక అవకాశమును ఇచ్చిన వారవుతారు!
ప్రశ్న:యేసుపై మీకున్న ప్రేమ విషయములో ఆస్తిem> గలవారని మీ పిల్లలు మీ గురించి చెప్పగలరా?
ఈ ప్రణాళిక ఒక తండ్రిగా మిమ్మును సవాలు చేయుచున్నదా?
దీనిని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే లో Radical Wisdom devotional కనుగొనగలరు.
ఈ ప్రణాళిక గురించి
మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపాటు లేని వారుగా భావిస్తారు, కావున లేఖనముల నుండి మరియు ఇతర తండ్రుల దగ్గర నుండి - సూచనలను తీసుకొనుట ఎంతో ఆవశ్యమై యున్నది. ప్రాధమిక జ్ఞానము అనునది, లేఖనముల నుండి మరియు తన తప్పుల నుండి గుణపాఠములను నేర్చుకొనిన ఒక తెలివైన తండ్రి యొక్క అనుభవము నుండి కొన్ని సూచనలను మరియు జ్ఞానమును మిళితం చేసి తండ్రుల కొరకు రూపొందించబడి అంతఃపరిశీలన వైపు సాగే ఒక జ్ఞానయుక్తమైన ప్రయాణమై యున్నది.
More