ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణమునమూనా
నీవు దేనిని మహిమ పరుస్తావో దానినే నీవు పొందుకుంటావు
తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడే మేకప్, పౌడర్, ఐలైనర్ మరియు లిప్‌స్టిక్‌లకు పరిచయం చేయబడిన ఒక యువతిని ఆమె తల్లి “తయారు” చేసినట్లు మీరు ఎప్పుడైనా చూశారా? ఆ యువతి సౌందర్యవతి అని కాదు, కానీ ఆమె (లేదా ఆమె తల్లి) చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున ఆమె ఎంత అందంగా ఉన్నదో ఆమెకు చెప్పబడింది.
మీరెప్పుడైనా చిన్న పిల్లలు ఆడే లీగ్ ఆటకు వెళ్ళినప్పుడు, తమ బిడ్డలు చేసే బేస్ హిట్ లేదా హోమ్ రన్ చేస్తున్నప్పుడు, వారు స్లైడ్ మరియు స్కోర్లు చేస్తున్నప్పుడు వారి తండ్రులు చుట్టూ ఉన్న వారితో చప్పట్లు కొడుతూ ఆనందంతో అరుస్తూ ప్రోత్సాహాపరుస్తున్నట్లు చూసారా?
ఆ యువతియువకుల్లో కొంత మంది స్త్రీ పురుషులుగా ఎదగటం చూడగలిగేంత కాలం నేను జీవించాను మరియు నీవు దేనిని మహిమ పరుస్తావో దానినే నీవు పొందుకుంటావు! అనే విషయాన్ని నేను చూసాను.
మన బిడ్డలకు బట్టలు ధరింపజేయుటకు మరియు కౌమారదశకు చేరినప్పుడు వారిని పరిపూర్ణతకు తీసుకురావటానికి మన సమయాన్ని మరియు ధనాన్నిఎంతో వ్యయపరచినప్పుడు, పెద్దయ్యాక వారిని కేవలం "బట్టల అంగడి"గానే పొందుకొనగలము. మన పిల్లలు కేవలం క్రీడలలో తమ ఉత్తమ ప్రదర్శనకే ప్రశంసను పొందుకున్నట్లైతే, రేపు వారు పెద్దయ్యాక క్రీడల దుస్తులనే మనం పొందుకొనగలము.
దుస్తులు లేదా మేకప్ లేదా క్రీడలలో తప్పేమీ లేదు.
కానీ, మీ పిల్లలను ఏ విషయంలో మీరు ఘనపరుస్తున్నారో కాస్త జాగ్రత్త వహించండి.
నా మట్టుకు నా నిఘంటువులో, "మహిమ/ఘన" పరచటం అనే పదము "ప్రశంస"తో మార్చుకొనదగినదిగా ఉన్నది. మీ పిల్లలను ఏ విషయంలో ప్రశంసిస్తారో వారు ఎదుగుచుండగా వాటినఅనుకరిస్తారు.
మీ పిల్లలు ఇతరుల పట్ల చూపే దయను ప్రశంసించుటను పరిగణించండి. తమ సహోదరునికి లేదా సహోదరికి వారు చేసే సాయాన్ని గుర్తించండి. అందుకు వారిని ప్రశంసించండి. వారి ప్రార్థనను, బైబిల్ చదువుటను, యేసు గురించి తెలుసుకొనుటను మరియు చర్చికి, ధార్మిక సంస్థలకు లేదా పేదలకు డబ్బు సాయం ఇచ్చినందుకు వారిని ఘనపరచండి.
వారికి మీరు ఎప్పుడు మార్గదర్శకమేనని గుర్తుంచుకోండి. కాని అది ఎక్కడకు అనేదే అసలైన ప్రశ్న.
ప్రశ్న:మీ పిల్లలు పెద్ద వారైనప్పుడు వారు ఏమి అవ్వాలని ఆశిస్తున్నారో దానిలోనే మీరు వారిని ప్రశంసిస్తూ నడిపిస్తున్నారా?ఈ ప్రణాళిక గురించి
మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపాటు లేని వారుగా భావిస్తారు, కావున లేఖనముల నుండి మరియు ఇతర తండ్రుల దగ్గర నుండి - సూచనలను తీసుకొనుట ఎంతో ఆవశ్యమై యున్నది. ప్రాధమిక జ్ఞానము అనునది, లేఖనముల నుండి మరియు తన తప్పుల నుండి గుణపాఠములను నేర్చుకొనిన ఒక తెలివైన తండ్రి యొక్క అనుభవము నుండి కొన్ని సూచనలను మరియు జ్ఞానమును మిళితం చేసి తండ్రుల కొరకు రూపొందించబడి అంతఃపరిశీలన వైపు సాగే ఒక జ్ఞానయుక్తమైన ప్రయాణమై యున్నది.
More