ప్రణాళిక సమాచారం

ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణమునమూనా

Radical Wisdom: A 7-Day Journey For Fathers

DAY 3 OF 7

కాపరి లేని గొర్రెలు

పిల్లలు గొర్రెల వంటి వారు. వారు స్వతంత్ర దిశగా పయనిస్తునారు, ఇప్పటికైతే, తమ యొక్క యవ్వనము మరియు బలముతో శక్తివంతులుగా ఉన్నప్పటికి-అనుభవ లేకపోవుట చేత ప్రమాదముల గుండా పయనిస్తున్నారు.

గొర్రెల వలె, వారిని గమనించడానికి ఎవరైనా. . . ఒక కాపరి కావాలి. వారికి ఒక తండ్రి అవసరం. ఒక యథార్థమైన తండ్రి. విచారమేమిటంటే, చాలా మంది పిల్లలు వారికి ఒక కాపరి లేకుండా ఎదుగుచున్నారని నాకు తెలుసు.

కాపరివలె తమ యొక్క కర్తవ్యమును తీవ్రముగా పరిగణించే తండ్రులలో మీరు ఒకరై యున్నందుకు సంతోషము. కాపరి వంటి ఒక తండ్రి వారి కొరకు ఏమి చేస్తారు?

  1. తెలుసుకొనును - గొర్రెలు ఏ స్థితిలో ఉన్నాయో వాటి కాపరులకు ఏ విధముగా తెలుసునో, అదే విధంగా తండ్రులు కూడా తమ బిడ్డలు శారీరకంగా, బాంధవ్య విషయాలలో మరియు ఆత్మీయముగా . . . ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుంటారు.
  2. మందగా ఉంచును - కాపరులు తమ మందలను కలిసికట్టుగా ఉంచుతారు. తండ్రులు కూడా అదే విధమైన బాధ్యతను కలిగియున్నారు, తన భార్యతో జతగా ఉండుట ద్వారా ఇది మొదలవుతుంది. రెండు పెద్ద గొర్రెలు వేరుగా ఉండుటకు మీరు అనుమతించినట్లయితే మీరు మీ చిన్న గొర్రెలను కలిసి ఉంచలేరు.
  3. పోషించును - కాపరులే తమ గొర్రెలకు ప్రధాన పోషకులు. తండ్రులు తమ బిడ్డల కొరకు తప్పక ఇది చేయవలసి యున్నది. ఏ ఒక్క తండ్రి కూడా పనిచేయని వారుగా ఉండకూడదు. . . మరిఎక్కువగా ఒక క్రైస్తవుడు అస్సలు ఉండకూడదు. తమ బిడ్డల శారీరక అవసరతలను అందించే దాని కంటే మిన్నగా, తండ్రులు తమ బిడ్డలకు ఆత్మీయ ఆహారమును అందించుటతో పాటుగా వారికి షరతులులేని ప్రేమను అందించే వారుగా ఉండాలి.
  4. కాయును - తమ గొర్రెలను బాధపెట్టే లేదా దారితప్పించే దేనినైనా లేక ఎవరినైనా తరిమికొట్టడానికి గొర్రెల కాపరులు ఏమైనా చేస్తారు. కోపం, ఆలోచనలేమి లేదా నిర్లక్ష్యం ద్వారా తమ పిల్లలను బాహ్య బెదిరింపుల నుండి మరియు వారిని బాధించే వాటి నుండి తండ్రులు కాపాడుతారు

చాలా మంది తండ్రులు మందగా నున్న తొంబది తొమ్మిది గొర్రెల విడచి తప్పిపోయిన గొర్రెను వెదికెదరు. మీరు కూడా అదే విధంగా వారిని గూర్చి తెలుసుకుంటూ, మందగా కూర్చుతూ, పోషిస్తూ కాపాడతారా?

ప్రశ్న:మీ గొర్రెలలో ఎవరైనా ఒకరు ఎప్పుడైనా దూరమవుతున్నారో తెలుసుకోవడానికి మీరు వారిపట్ల తగినంత శ్రద్ధ తీసుకుంటున్నారా?

Day 2Day 4

About this Plan

Radical Wisdom: A 7-Day Journey For Fathers

మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సి...

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Radical Mentoring వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం http://radicalwisdombook.com దర్శించండి

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy