ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణమునమూనా
కొంత విచారముతో ఉన్న తండ్రి
వ్యాపార రంగంలో నిర్ణయాలు తీసుకునే “హేతుబద్ధమైన పద్ధతి” తీసివేయబడిన యుగం అది. అతి తక్కువ వైఫల్యాలతో విజయం యొక్క అత్యధిక సంభావ్యతను చేరుటకు మేము సూత్రాలను సృష్టించాము. ఏ కార్యములు చేస్తే, ఎక్కువ గెలస్తామో వాటినే మేము రిస్క్ తీసుకుని చేసాము. .
తండ్రులుగా, మన పిల్లలతో "రిస్క్ తీసుకోవాలని" మనము ఆశించము. మనము ఎంత చేసినప్పటికీ, యేసును వెంబడించే అద్భుతమైన పెదదుతీర్చదిద్దబడతారని ఏ మాత్రము మనము హామీ ఇవ్వలేము. అయినప్పటికి కానీ విచారం యొక్క అతి తక్కువ గుణకానికి దారితీసే నిర్ణయాలు మనము తీసుకోవచ్చు! భవిష్యత్తులో చింతించే పనులు చేయకుండా ఉండుటకు మనము ఇప్పుడే సరైన వాటిని ఎంచుకోవచ్చు.
చాలా మంది పురుషులు తమ నాలుకను మరియు కోపతాపాలను నియంత్రించని తండ్రులు వారికి చేసిన గాయాలతోనే జీవిస్తున్నారు. "తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి." తక్కువలో తక్కువ, మనము నోరు మూసుకోవాలి. మన యొక్క విమర్శనాత్మక ధోరణిని మరియు కోపమును నియంత్రించుకోవాలి. అది చేసేంత వరకు. . . మనము దాన్ని చేస్తున్నట్లు సాధారణంగా గుర్తించలేము.
మన తండ్రుల నుండి ప్రశంస మరియు మెప్పుతో కూడిన పదములను వినాలని ఎంతగానో కోరుకుంటాము, కాని మనలో చాలా మంది దాన్ని చేసియుండరు. గర్వము మనలను ఎలా స్తంభింపజేస్తుందో చూస్తే చాలా వింతగా ఉంటుంది. యాంత్రిక జంతువులను, మోటారు సైకిళ్ళు మరియు వేక్‌బోర్డులను మనము నడుపుతాము, కాని మన కుమారులు మరియు కుమార్తెలకు వారు ఎంత ప్రత్యేకమైనవారో మరియు మనం వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పడం ద్వారా వారికి విచిత్రంగానో లేదా మృదువుగానో అనిపిస్తుందనే భయాలను మాత్రం మనము అధిగమించ లేకపోతున్నాము.
మీరు మీ పిల్లల కోసం పూర్తి నిబద్ధతతో ఉన్నారా? దినములు గడిచే కొలది ఇలా చేసియుంటే /చేయకుండా యుండియుంటే బాగుండేది అని అనుకునే విధంగా మీరు తీసుకునే నిర్ణయాలు కొద్దిగా ఉండే వైపే తండ్రిగా మీ బాధ్యతను నిర్వర్తిస్తున్నారా?
ప్రశ్న: ఇప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయమేదైనా, సంవత్సరాలు గడిచిన పిమ్మట మిమ్ములను బహుగా బాధించేదిగా అయ్యే విషయమును తెలియజేయుమని దేవుని అడగండి? తరువాత దానిని పరిష్కరించడానికి కావలసిన ధైర్యమును ఇవ్వమని ఆయనను అడగండి?
ఈ ప్రణాళిక గురించి
మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపాటు లేని వారుగా భావిస్తారు, కావున లేఖనముల నుండి మరియు ఇతర తండ్రుల దగ్గర నుండి - సూచనలను తీసుకొనుట ఎంతో ఆవశ్యమై యున్నది. ప్రాధమిక జ్ఞానము అనునది, లేఖనముల నుండి మరియు తన తప్పుల నుండి గుణపాఠములను నేర్చుకొనిన ఒక తెలివైన తండ్రి యొక్క అనుభవము నుండి కొన్ని సూచనలను మరియు జ్ఞానమును మిళితం చేసి తండ్రుల కొరకు రూపొందించబడి అంతఃపరిశీలన వైపు సాగే ఒక జ్ఞానయుక్తమైన ప్రయాణమై యున్నది.
More