ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణమునమూనా
కలిసి భోజనం చేయుట
నా భార్య నా కంటే ఎక్కువగా పట్టుబట్టిన విషయాలన్నిటిని నేను లెక్కించగలను. కలిసి భోజనం చేయుట అనేది అందులో ఒకటి.
"నీవు ఎప్పుడు ఇంటికి వస్తావు?" అని ఆమె అడుగును. "నేను బాగా అలసిపోయాను . . . కొంచెం ఆగి వస్తాను" అని నేను చెప్తాను. "వాటన్నిటిని విడిచిపెట్టి ఇంటికి బయలుదేరండి. మన కుటుంబంలో మనం కలిసి భోజనం చేస్తాము. దానంతటిని సిద్ధపరచి మేము 6:30 కల్లా టేబుల్ దగ్గర మేము ఉంటాము!" అని ఏ మాత్రం భయపడకుండా నిక్కచ్చిగా జవాబిస్తుంది.
నేను కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నప్పటికి, మరీ ఎక్కువ ఏం కాదు. ఒక కుటుంబంగా మనమందరము కలిసి భోజనం చేయాలని నా భార్య తరచుగా పట్టుబట్టి చెప్తుంది, మొదట్లో, ఈ విషయం ఎందుకంత ప్రాముఖ్యమని నేను గ్రహించలేకపోయాను.
రోజులు గడచిన కొలది, ప్రత్యేకముగా నా పిల్లలు యవ్వనదశకు చేరువవుతున్నప్పుడు, నేను దాని విలువను చూసాను. ప్రతిదినము మేమందరం ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే సందర్భాలలో ఇదీ ఒకటి. చాలా సంగతులను గూర్చి మాట్లాడుకుంటాము. ఈ సమయంలో వారి మనసులో ఉన్నది మేము వినగలము అలాగే వారు కూడా మా మనసులో ఉన్నది ఎరుగగలరు. తమ తల్లిదండ్రులు ఎలా మాట్లాడుకుంటారో, ఎలా కలిసి పని చేస్తారో మరియు ఒకరినొకరు ఎలా ప్రేమిస్తారో వారు చూడగలరు. కుటుంబ బాధ్యతలలోని చిన్న మోతాదును పిల్లలు అక్కడ చూడగలరు.
బాధ్యతతో కూడిన ప్రేమను, కుటుంబ నడవడికను, నమ్మకత్వమును, దయను, సంబంధ సమస్య-పరిష్కారములను మరియు క్షమాపణను ఇంటిలో కాకపొతే పిల్లలు ఇంకెక్కడ నేర్చుకుంటారు? వివాహమునకు మరియు కుటుంబ జీవితమునకు ఎవరు వారిని సిద్ధపరుస్తారు? "భర్త బడి" లేక "భార్య బడి" వంటి వాటిల్లో మన పిల్లలు ఈ విషయాలను నేర్చుకుంటారని నేను ఇంతవరకు ఎరుగను.
ప్రశ్న: ఒక క్రమముగా మీ కుటుంబమంతా కలిసి కూర్చుకొనగలుగుతున్నారా? " ఇప్పటినుండి ఇరవై ఏళ్ల తర్వాత, కుటుంబము నుండి కాక బయట నుండి పొందుకునేవే వారికి ప్రాముఖ్యమగునా? ", అని ఒక్కసారి మిమ్మును మీరే ప్రశ్నించుకోండి.
ఈ ప్రణాళిక గురించి
మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపాటు లేని వారుగా భావిస్తారు, కావున లేఖనముల నుండి మరియు ఇతర తండ్రుల దగ్గర నుండి - సూచనలను తీసుకొనుట ఎంతో ఆవశ్యమై యున్నది. ప్రాధమిక జ్ఞానము అనునది, లేఖనముల నుండి మరియు తన తప్పుల నుండి గుణపాఠములను నేర్చుకొనిన ఒక తెలివైన తండ్రి యొక్క అనుభవము నుండి కొన్ని సూచనలను మరియు జ్ఞానమును మిళితం చేసి తండ్రుల కొరకు రూపొందించబడి అంతఃపరిశీలన వైపు సాగే ఒక జ్ఞానయుక్తమైన ప్రయాణమై యున్నది.
More