ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణమునమూనా
యేసును వెంబడించు తండ్రులు
యేసును వెంబడించు తండ్రులు మొదటగా తమ బిడ్డలకు క్రీస్తులో వారేమైయున్నారో అనే విషయమును గ్రహించుటలో వారికి సహాయపడును. పూర్తిగా క్షమించబడి, సమస్తము కలిగియున్న మరియు సంపూర్ణమైన విలువగల వానివని- మరియు రాజులకు రాజు యొక్క దత్తపుత్రులని నీ బిడ్డలకు తెలుసా?
క్రీస్తులో తామేమైయున్నామో మీ పిల్లలు గ్రహించినట్లయితే, వారి గురించిన ఒక అర్థవంతమైన గుర్తింపును కనుగొనగలరు. తప్పొప్పులను కనుగొనుటలో అయోమయంగా అనిపించిన సందర్భాలలో లేక తల్లిదండ్రులు ఏదైనా నిర్ణయ విషయంలో వెనక్కి లాగినప్పుడు, అప్పుడు మీరేమి చేయవలెనో తెలుసుకొనుటలో ఈ గుర్తింపు మీకు సులభతరం చేస్తుంది.
అప్పుడు వారి ఆలోచనా ధోరణి "యేసు నన్ను ఈ విషయంలో ఏం చేయాలని కోరుకొంటున్నాడు?" అను విధంగా మారును ఎందుకనగా వారేమైయున్నారో క్రీస్తులో వారి యొక్క గుర్తింపు అన్న పునాదిపైనే ఆధారపడి యుంటుంది.
నా స్నేహితులైన క్రేగ్ మరియు కెర్రీలకు ముగ్గురు అందమైన కుమార్తెలు ఉన్నారు. షార్ట్ స్కర్ట్స్ మరియు తక్కువ కట్ బ్లౌజ్‌ల ధరింపు గురించి నిర్ణయాలు వచ్చినప్పుడు, "ఇది మీకు సరైనదని అనిపిస్తుందా?" అని కెర్రీ అడుగును, అమ్మ తన ఆలోచనను వారిపై రుద్దుతుందని అనుకుని, చాలా మంది పిల్లలు ఈ ఆలోచనను ప్రక్కకి నెట్టేస్తారు.
కాని ఈ ఆడపిల్లలు తమకంటూ ఒక స్వంత గుర్తింపును . . . ఏది సభ్యకరమో ఏది అసభ్యకరమో వారికంటూ కొన్ని హద్దులను ఏర్పరచుకున్నారు. వేటిని ధరించాలో వేటిని ధరించకూడదో అనే విషయంపై వారు చాలామట్టుకు తగవులను తప్పించుకోగలిగారు ఎందుకనగా వారిపై ఒక అవగాహన కలిగియున్నారు. "నేను ఎవరో నాకు తెలుసు. నాలాంటి వారు ఇటువంటి వాటిని ధరించకూడదు. నాలాంటి వారు ఇలాంటి పనులు చేయకూడదు."
ప్రశ్న: క్రీస్తులో తామేమైయున్నమో తెలుసుకునే దిశగా మీ పిల్లలను తమ గుర్తింపు వైపు నడిపే విధంగా వారిపై దృష్టి సారిస్తారా?
ఈ ప్రణాళిక గురించి
మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపాటు లేని వారుగా భావిస్తారు, కావున లేఖనముల నుండి మరియు ఇతర తండ్రుల దగ్గర నుండి - సూచనలను తీసుకొనుట ఎంతో ఆవశ్యమై యున్నది. ప్రాధమిక జ్ఞానము అనునది, లేఖనముల నుండి మరియు తన తప్పుల నుండి గుణపాఠములను నేర్చుకొనిన ఒక తెలివైన తండ్రి యొక్క అనుభవము నుండి కొన్ని సూచనలను మరియు జ్ఞానమును మిళితం చేసి తండ్రుల కొరకు రూపొందించబడి అంతఃపరిశీలన వైపు సాగే ఒక జ్ఞానయుక్తమైన ప్రయాణమై యున్నది.
More