ప్రాధమిక జ్ఞానము: తండ్రుల కొరకు 7 రోజుల ప్రయాణమునమూనా
సమృద్ధి vs. కొరత
పిల్లలను పెంచుట కష్టతరమే. మన చుట్టూ ఉన్న క్లిష్టమైన పనులలో ఇది కూడా ఒకటి. ఒక మార్గదర్శక పుస్తకమంటూ లేదు, స్థిరమైన సూచిక అంటూ ఒకటి లేదు, మరియు ప్రతి ఒక్క బిడ్డను భిన్నంగా చేయుట ద్వారా మనము ఊహించని వాటిని దేవుడు మనకు అప్పగిస్తాడు. కాలము గడిచే కొలది, మీకు అర్థమైన ఒక సూత్రాన్ని మీరు తీసుకుంటారు; దాన్ని మీరు ప్రయత్నిస్తారు, ఒకవేళ అది పని చేస్తే అది మీదే అవుతుంది.
కావున నేనిప్పుడు ఒక సూత్రమును తెలియజేస్తాను: మీ పిల్లలలకు ఒక సమృద్ధి అయిన వాతావరనమును సృష్టించండి.
పిల్లలు ప్రేమను కోరుకొందురు మరియు అది వారికి అవసరము కూడా. ఈ లోకములోనున్న అనేకమైన విషయాల లాగానే, ఏదైనా కొద్దిగా ఉన్నప్పుడు, అది మనకెంతో విలువైనదిగా ఉండును మరియు కొన్నిమార్లు వాదమును రేపును. అదే సమృద్ధిగా ఉంటే, అదేం పెద్ద విశేషమేమి కానిదిగా ఉండును.
ఉప్పును మరియు చమురును ఉదాహరణములుగా తీస్కోని చూడండి. ప్రతి దేశమునకు పెట్రోలియం అవసరం, కాబట్టి దాని కోసం తీవ్రమైన పోటీ ఉంది. ధర కూడా ఎక్కువే మరియు ఇంకా పెరుగుతాయనేది కూడా వాస్తవము. ఆ చమురు కోసం ప్రజలు కొట్టుకుంటారు, విషయాలను తారుమారు చేస్తారు, లంచములు పుచ్చుకుంటారు మరియు తమ ప్రాణములనే పణముగా పెడతారు.
మరొక ప్రక్కన,మనిషి జీవనానికి ఉప్పు ఎంతో అవసరం, కాని అది సమృద్ధిగా ఉన్నది. ఒక కిలో ఉప్పు కొన్ని రూపాయలకే దొరుకును. ఎందుకంటే చాల ఎక్కువ ఉన్నది.
తండ్రులు తమ పిల్లలతో సమయమును గడుపుటలో విఫలమైనప్పుడు, వారి పిల్లలకు సమయమివ్వ లేనంతగా బిజీ అయినప్పుడు, తమ తండ్రులకు తాము ప్రాముఖ్యమని వారెంత మాత్రం అనుకోరు, తండ్రుల యొక్క అందుబాటు తక్కువైనప్పుడు, ఆ తండ్రికి నిజముగా తన పిల్లలతో సమయము గడపలేనప్పుడు, దానిని కొరతగా ఉన్న వాతావరణముగా పరిగణించవచ్చును.
కాని ఎప్పుడైతే తండ్రులు వారికి అత్యధికమైన ప్రేమను అందిస్తారో మరియు తండ్రి వారికి తగినంత అందుబాటులో ఉంటాడో, అప్పుడక్కడ తక్కువ పోటితత్వం, తక్కువ గజిబిజి ఉండి తమ గృహములో ఎక్కువ శాంతి ఉంటుంది. శారీరకంగా మరియు మానసికంగాను తండ్రి ఖచ్చితంగా వారి దగ్గర ఉండాలి.
సమృద్ధి అయిన వాతావరణము అలవోకగా వచ్చేయదు, మరియు అది అంత సులువు కూడా కాదు.
అయినప్పటికి, అది ఎంతో విలువ గలది.
ప్రశ్న:మీ ఇల్లు సమృద్ధి అయిన వాతావరణము గలిగినదా లేక కొరత కలిగిన వాతావరణముతో కూడినదా? పిల్లలు సమృద్ధిఅయిన ప్రేమ కలిగిన వాతావరణములలో వృద్ధి చెందుతారు. ప్రేమ కొరతగా ఉన్న వాతావరణములలో వారు క్షీణించెదరు.
ఈ ప్రణాళిక గురించి
మన తండ్రులు మనలను ఎంతగా తీర్చి దిద్దుతారో అని ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. తమ తండ్రి యొక్క ప్రభావము నుండి ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు. మరియు చాలా మంది మగవాళ్ళు తండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపాటు లేని వారుగా భావిస్తారు, కావున లేఖనముల నుండి మరియు ఇతర తండ్రుల దగ్గర నుండి - సూచనలను తీసుకొనుట ఎంతో ఆవశ్యమై యున్నది. ప్రాధమిక జ్ఞానము అనునది, లేఖనముల నుండి మరియు తన తప్పుల నుండి గుణపాఠములను నేర్చుకొనిన ఒక తెలివైన తండ్రి యొక్క అనుభవము నుండి కొన్ని సూచనలను మరియు జ్ఞానమును మిళితం చేసి తండ్రుల కొరకు రూపొందించబడి అంతఃపరిశీలన వైపు సాగే ఒక జ్ఞానయుక్తమైన ప్రయాణమై యున్నది.
More