బైబిల్ సజీవంగా ఉందినమూనా
బైబిల్ నిరీక్షణ తెస్తోంది
2016 లో యేసు యొక్క జీవితాన్ని మార్చే శక్తిని కనుగొనేంత వరకు ఘానా* ఒక భక్తి గలిగిన ముస్లింగా ఉన్నది. కానీ క్రైస్తవురాలిగా మారిన తరవాత ఆమెను తన సమాజము మరియు తన కుటుంబ సభ్యులు విడిచిపెట్టి, బహిష్కరించి వెలివేశారు. ఒకసారైతే, ఆమె పిల్లలను ఆమె దగ్గర నుండి తీసుకెళ్లి వేరే దేశానికి పంపించారు.
ఘానా యేసును తిరస్కరించకపోయినప్పటికి, ఆమెకు విశ్వాసములో ఎదగటానికి ఒక గట్టి సహకారం లేనట్టుగా అనిపించింది. ఒంటరిగా నిరుత్సాహముతో చనిపోవాలని కూడా అనుకుంది. కానీ చివరికి ఆమె ఫోనులో యు వెర్షన్ ఆప్ ను డౌన్లోడ్ చేసిన వ్యక్తిని కలిసింది.
మొదట్లో ఘానా ఆసక్తి చూపలేదు, కానీ తరవాత దాని అర్ధాన్ని ధ్యానించి ప్రతి రోజుకు ఒక మార్గదర్శిగా వాడటానికి ఈ దిన బైబిల్ వాగ్దానమును సాయంకాలంలో చదవడం ప్రారంభించింది. అయితే క్రమీనా అనుకోని విషయము ఒకటి జరిగింది…
“ఆ వచనము జీవము కలిగి నాలో నివసించింది. వారు నాకు ప్రజలతో ఆరోగ్యకరంగా ఎలా వ్యవహరించాలో నేర్పించారు మరియు నా నిరుత్సాహం నుంచి బయటికి రావడానికి కూడా తోడ్పడ్డారు. నేను విడిచిపెట్టబడినప్పటికీ దానిని ఎప్పుడు చదివినా నేను ఆదరణ పొందేదానను. ఈ దిన బైబిల్ వాగ్దానమును నేను ఎప్పుడు చదివినా, ఒక వినూత్న విధముగా నన్ను ఎత్తిపట్టుకొని నాకు ఒక నిరీక్షణనిస్తోంది. అది దేవుడు నేరుగా నాతోనే ఆ వాక్యము ద్వారా మాట్లాడుతున్నట్టుగా ఉంది.”
ఘానా ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లిన ఈ దిన బైబిల్ వాగ్దానము గురించి చెప్పడానికి అవకాశాల కొరకు ఎదురుచూస్తుంది. తన సమాజపు వారిని ప్రోత్సాహించడానికి ఆన్లైన్ లో వాక్యాలను పోస్ట్ చేస్తుంది, తాను పనిచేసే చోట కూడా సహోద్యోగులతో మరియు ఖాతాదారులతో లేఖనాల గురించి మాట్లాడుతుంది.
దేవుని వాక్యము మన జీవితములో ఏమి చేయగలదో, దానికి ఆమె కథ ఒక్క నిదర్శనము మాత్రమే. పరిస్థితులు మారొచ్చు, భావోద్వేగాలు తారుమారు కావొచ్చు, మనుషులు నిరుత్సాహ పరచి మనల్ని విడిచిపెట్టొచ్చు - కానీ దేవుని వాక్యము నిరంతరముండును. తద్వారా మన పరిస్థితులను అధిగమించే శాంతి మరియు నిరీక్షణ మనము అనుభవించగలము. ఎందుకంటే మన హృదయములోనికి దేవుని వాక్యాన్ని మనము అనుమతించినప్పుడు, అది అక్కడ ఉండిపోతుంది.
ఈరోజు ఈ ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని నీ జీవితములో జీవింపచేయమని దేవున్ని అడుగు:
దేవా, నీవు నన్ను నిర్మించావు మరియు నేనేమైయున్నానో అది నీకు తెలుసు. నా జీవితాన్ని మార్చే శక్తి నీకు మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు నా జీవితాన్ని నీ వాక్యంతో సరిచేయ్యమని అడుగుతున్నాను. నేను ఏమి ఎదుర్కున్నను, నీవు నా జీవితములో ఉంచిన ప్రజలకు నీ సత్యమును మరియు ప్రేమను ప్రకటించుటకు నీ వాక్యానికి నిజాయితీగా ఉండుటకు నాకు ధైర్యము నిమ్ము. నీకు దగ్గరవుచ్చున కొలది నా విశ్వాసమును లోతుగా స్థిరపరచుమని యేసు నామములో కోరుతున్నాను. ఆమెన్
*ఆ వ్యక్తి గుర్తింపు కాపాడుటకు పేరు మార్చబడినది.
ఈ ప్రణాళిక గురించి
ఆది నుండి కూడా దేవుని వాక్యము హృదయాలను మరియు మనసులను పునరుద్ధరిస్తు ఉంది కానీ ఇంకా దేవుని కార్యము పూర్తి కాలేదు. ఈ 7 రోజుల ప్రత్యేక ప్రణాళికలో, ప్రపంచ వ్యాప్తంగా చరిత్రను తిరగ రాయడానికి మరియు జీవితాలను మార్చడానికి దేవుడు బైబిలును ఎలా వాడుకుంటున్నాడో కొంచెం లోతుగా చూస్తూ, లేఖనాలుకు ఉన్నటువంటి జీవితాన్ని మార్చే శక్తిని కొనియాడెదము.
More