బైబిల్ సజీవంగా ఉందినమూనా
బైబిల్ దేశాలను మారుస్తుంది
అది 1800 ప్రారంభంలో. ఒక 12 సంవత్సరాల నైజీరియా బాలుడు మరియు తన కుటుంబముతో సహా వారి ఇంటిలోనుండి తీసుకుని పోయి అమెరికా వెళ్ళే పోర్చుగీస్ బానిసల ఓడలోనికి బాలవంతముగా నెట్టివేశారు. కానీ ఆ పడవ బయలుదేరక ముందే బానిస నిరోధక బృందము దాడి చేసి ఆ దుండగులను బందించారు. అప్పుడు ఆ బాలుడు మరియు తన కుటుంబము విముక్తి పొంది సియరా లియోన్ అనే ప్రాంతానికి పంపబడ్డారు. ఇక్కడే అతను బైబిల్ యొక్క శక్తిని కనుగొన్నాడు.
క్రైస్తవుడైన తరవాత శామ్యూల్ అజాయి క్రోతర్ ఎన్నో భాషలు నేర్చుకోవడం ప్రారంభించాడు మరియు సువార్త ప్రకటించడానికి సియరా లియోన్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు వెళుతుండేవాడు. కానీ తన నైజీరియా భాషయైన ఏరోబా భాషలో బైబిల్ లేదు గనుక ఈ సమయమంత అతను బైబిల్ ను ఇంగ్షీషు లోనే చదివే వాడు.
అంటే ఇంగ్షీషు రాని నిజేరియా ప్రజలు దేవుని వాక్యాన్ని చదవలేరన్న మాట. కావున అజాయి ఏరోబా భాష కొరకు ఒక వ్యాకరణ వ్యవస్థను తయారు చేసిన తరవాత బైబిలును ఆ భాషలోకి తర్జుమా చేసాడు.
ఏరోబా బైబిల్ పూర్తైన తరవాత, తాను పొందిన జీవితాన్ని మార్చే అనుభవాన్ని అనేకమంది ప్రజలు పొందాలని మరెన్నో నైజీరియా భాషల్లోకి బైబిల్ ను తర్జుమా చేయటం కొనసాగించాడు.
అప్పుడు క్రోతరును “నైజర్ యొక్క బిషప్” గా ఆంగ్లికన్ చర్చి వారు ఎన్నుకున్నారు, ఆ విధముగా అతను మొట్టమొదటి నల్లజాతి బిషప్ గా పేరు పొందారు. ఈరోజు ఆంగ్లికన్ చర్చి అఫ్ నైజీరియా కోటి 80 లక్షలకు పైగా బాప్తిస్మము పొందిన సభ్యులతో రెండవ అతిపెద్ద ఆంగ్లికన్ ప్రాంతముగా నిలిచింది.
క్రోతర్ ద్వారా పనిచేసిన ఆ దేవుడే నీ ద్వారా కూడా పనిచేసి ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నాడు. నువ్వు మాత్రమే చేరుకొన గలిగిన ప్రదేశంలో నివసిస్తూ బైబిల్ చే మార్చబడటానికి ఎదురు చూస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు.
కాబట్టి ఈరోజే దేవుడు చెప్పే కథలో నువ్వు ఏ పాత్ర పోషించగలవో ఆయన్ని అడుగు మరియు నీవు అడిగి ఊహించిన దాని కన్నా ఆయన నీ జీవితము ద్వారా చేయు కార్యమును నీవు చూడుము.
ఈ ప్రణాళిక గురించి
ఆది నుండి కూడా దేవుని వాక్యము హృదయాలను మరియు మనసులను పునరుద్ధరిస్తు ఉంది కానీ ఇంకా దేవుని కార్యము పూర్తి కాలేదు. ఈ 7 రోజుల ప్రత్యేక ప్రణాళికలో, ప్రపంచ వ్యాప్తంగా చరిత్రను తిరగ రాయడానికి మరియు జీవితాలను మార్చడానికి దేవుడు బైబిలును ఎలా వాడుకుంటున్నాడో కొంచెం లోతుగా చూస్తూ, లేఖనాలుకు ఉన్నటువంటి జీవితాన్ని మార్చే శక్తిని కొనియాడెదము.
More