బైబిల్ సజీవంగా ఉందినమూనా
బైబిల్ చీకటిలోకి చొచ్చుకుపోతుంది
సుము అసలు పట్టించుకో కూడదు అనుకుంది. కానీ 2017లో , సుము యొక్క ప్రాణ స్నేహితురాలు తన సాక్షాన్ని వాళ్ళ న్యూజిలాండ్ చర్చిలో పంచుకుంది. సుము ఆమెకు సహాయము చెయ్యడానికి వొచ్చింది … కానీ తిరిగి వెనక్కి వచ్చేసేది. ఆమె అదే సంవత్సరం చివరిలో ఇండియా కి వెళ్లే ముందుగానే తన జీవితాన్ని యేసయ్యకు ఇచ్చింది.
నూతన విస్వాసముతో ఒక క్రొత్త దేశములో క్రైస్తవ సహవాసము లేకుండా చాల అలసటగా అనిపించేది, ఆఖరికి ఎంతో నిరుత్సాహముతో మంచం మీద నుండి కిందకు దిగడానికి కూడా ఇబ్బందిగా ఉండేది.
“నేను చాల ఒంటరిగా ఉంటూ, ఇతరులతో మాట్లాడటం కష్టముగా ఉండేది. ఇండియా కి వెళ్ళినప్పుడు నేను నా స్వయంప్రతిపత్తిని మరియు స్వాతంత్య్రాన్ని ఏంటో కొలిపోయాను, నా మనసులోకి ఎన్నో విషపూరిత ఆలోచనలు జొరబడ్డాయి. కానీ YouVersion లో లేఖనాలను కలిసినప్పుడు నేను ఆలోచించే విధానాన్ని మార్చుకోగలిగాను.”
YouVersion వారు బైబిల్ ప్రణాళికల ద్వారా సుము ఇతర క్రైస్తవులతో అనుసంధానమై ఉండటానికి మరియు వారి నుంచి నేర్చుకోడానికి ఒక మార్గము ఏర్పరిచారు. 2018 నుండి ఆమె 428 ప్రణాళికలు పూర్తీ చేసారు.
సుముకు ఎప్పు ఏ ప్రశ్న ఎదురైనా, YouVersion యాప్ తెరిచి, ఆ విషయము పై ప్రణాళికల కొరకు వెతికేవారు. ఆమె ఎంత ఎక్కువగా ప్రణాళికలు చదివితే అంట ఎక్కువగా తన విస్వాసము ఎదుగుతూ ఉండేది.
“కొన్ని రోజులు నన్ను నేను సత్యములో ముంచుకోటానికి ఒక్కసారే 11 ప్రణాళికలు మొదలు పెట్టేదాన్ని. నీ పరిస్థితిలో ఇదివరకే ప్రయాణించిన వారి నుండి నేర్చుకొని ప్రోత్సాహము పొందటానికి ఇది ఒక అవకాశం. నా కష్టాల్లో నేను ఒంటరిదాన్ని కాదని నేను నేర్చుకుంటూ ఉన్నాను. నిరుత్సాహముతో బాధపడి బయట పడిన వారి మాటలు నేను విన గలిగాను, యేసుని వెంబడించే వారు కూడా మానసిక వ్యాధితో బాధపడతారని గ్రహించడానికి అది నాకు తోడ్పడింది.”
ఇప్పుడు, సుముకి ఎప్పుడైనా ఒంటరిగా, నిరుత్సాహముగా అనిపించినప్పుడు, దేవుని వాగ్దానాలకు అంటిపెట్టుకొని, ఆమెను గూర్చి యేసయ్య ఏమంటాడో దానిని బట్టి ఆమెకు వొచ్చు ప్రతి చెడ్డ ఆలోచనను ఆమె ఆపగలుగుతున్నారు.
“కొన్నిసార్లు, మీరు నిరుత్సాహము పొందినప్పుడు, మీకు కావలసినది ఒక మాట మాత్రమే. ఈ యాప్ ఒక సత్వరమార్గంగా బైబిలును మరియు నా విశ్వాసాన్ని కనుగొనటానికి తోడ్పడింది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదంటే, దాన్ని మనము మన విస్వాసముతో అనుసంధానమవ్వడానికి ఉపదయోగించుకోవొచ్చు. క్రీస్తుని కలవకపోతే ఈరోజు నేను ఉండే దానిని కాదు. ఎందుకంటే ఆ రోజులు చాల అంధకారమైనవి, నాకు వెలుగునిచ్చే ఆధారము ఆయన ఒక్కడే - ఇప్పుడు కూడా.”
దేవుని వాక్యపు శక్తి ద్వారా ఒంటరితనాన్ని సంబంధంగా మార్చావోచ్చు, ప్రతికూల సమయాల్లో కూడా నిరీక్షణను కనుగొనవొచ్చు.
ఒక్క క్షణము సుము యొక్క కథను గమనించు, మరియు నువ్వు ఉన్న ఈ కాలాన్ని బట్టి కొద్దిసేపు దేవునితో మాట్లాడు. ఇలా చేస్తూ ఉండగా, నీ పరిస్థితి యొక్క నిజం ఏంటో నీకు బయలు పరచమని దేవున్ని అడుగు, నిరీక్షణ నిచ్చే మరియు బలపరిచే ఆయన వాక్యము కొరకు లేఖనాలు పరిశీలించు. నీ జీవితములోని ఏ చీకటిలోకైనా చొచ్చుకుపోతానికి ఆయన వెలుగుని అనుమతించు.
ఈ ప్రణాళిక గురించి
ఆది నుండి కూడా దేవుని వాక్యము హృదయాలను మరియు మనసులను పునరుద్ధరిస్తు ఉంది కానీ ఇంకా దేవుని కార్యము పూర్తి కాలేదు. ఈ 7 రోజుల ప్రత్యేక ప్రణాళికలో, ప్రపంచ వ్యాప్తంగా చరిత్రను తిరగ రాయడానికి మరియు జీవితాలను మార్చడానికి దేవుడు బైబిలును ఎలా వాడుకుంటున్నాడో కొంచెం లోతుగా చూస్తూ, లేఖనాలుకు ఉన్నటువంటి జీవితాన్ని మార్చే శక్తిని కొనియాడెదము.
More