బైబిల్ సజీవంగా ఉందినమూనా

La Biblia está viva

7 యొక్క 1

బైబిల్ సజీవంగా ఉంది

బైబిల్ మనకు దేవుని వాక్యము. ఇది, ఆయన తన వ్యక్తిత్వం గురించి, మరియు మనుషులను రక్షించడానికి మరియు పునరుద్దరించడాన్ని గూర్చిన తన ప్రణాళికను దేవుడు మనుషుల ద్వారా చెప్పినటువంటి వ్రాయబడిన కథనం. ఇది దేవుని ద్వారా ప్రేరేపించబడినది కాబట్టి, లేఖనాలలో ఉన్న ప్రతి భాగానికి కూడా మనను ఆలోచింపచేసి, ఒప్పించి మరియు మనను మార్చే శక్తి ఉంది.

మీ మనసు పునరుద్ధరించబడినట్టుగా అనిపించిన లేకా మీలో ఒక భాగం మార్పు చెందినట్టుగా అనిపించినా ఒక సమయము గురించి ఆలోచించండి. ఒక వేళ క్రమం తప్పకుండా బైబిలును చదివినట్లైతే, దాని స్ఫూర్తినిచ్చే, ప్రోత్సాహించే మరియు మీకు సవాలు చేసే శక్తిని మీరు అనుభవించారు.

బైబిల్ ఒక చెరిత్ర పాఠం కంటే ఎక్కువ. దేవుడు చేసినదాన్నీ అది మళ్ళీ చెప్తునప్పటికి, దేవుడు ఏమి చేయబోతున్నాడో కూడా చెబుతుంది. దేవుడు చెరిత్ర మొత్తంలో బయలు పరస్తున్నటువంటి ఒక కథను, ఆయన మన ద్వారా చెపుతూ ఉండాలనుకున్న ఒక కథను, ఇది వెల్లడిస్తోంది.

సమయారంబం నుండి దేవుని వాక్యము ప్రజల హృదయాల్లో మెదిలింది, మరియు దాని ప్రోత్సాహం నగరాలను, దేశాలను మరియు ఖండాలను మార్పులోనికి నడిపించింది.

అయితే ఈ వారము, చరిత్ర మొత్తంలో దేవుడు క్రైస్తవుల ద్వారా చెబుతున్న కథనాన్ని చూస్తూ, బైబిలుకు ఉన్నటువంటి చీకటిలోకి చొచ్చుకు పోయే, నిరీక్షణానిచ్చే, జీవితాలను పునరుద్ధరించే మరియు లోకాన్ని మార్చే సామర్థ్యాన్ని ప్రదర్శించే కథనాన్ని చూస్తూ, బైబిల్ మన లోకంలో ఎంత సజీవంగా మరియు ఎంత చురుకుగా ఉందో దాన్ని బట్టి ఆనందిద్దాం.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

La Biblia está viva

ఆది నుండి కూడా దేవుని వాక్యము హృదయాలను మరియు మనసులను పునరుద్ధరిస్తు ఉంది కానీ ఇంకా దేవుని కార్యము పూర్తి కాలేదు. ఈ 7 రోజుల ప్రత్యేక ప్రణాళికలో, ప్రపంచ వ్యాప్తంగా చరిత్రను తిరగ రాయడానికి మరియు జీవితాలను మార్చడానికి దేవుడు బైబిలును ఎలా వాడుకుంటున్నాడో కొంచెం లోతుగా చూస్తూ, లేఖనాలుకు ఉన్నటువంటి జీవితాన్ని మార్చే శక్తిని కొనియాడెదము.

More

ఈ బైబిల్ ప్రణాళికను రూపొందించి మీకందించిన వారు YouVersion.