బైబిల్ సజీవంగా ఉందినమూనా

La Biblia está viva

7 యొక్క 2

బైబిల్ని ఎంతమాత్రమూ ఆపలేము

1500 లో, బైబిల్ చాలా భాషలలో అందుబాటులో ఉండేది కాదు. కేవలము విద్యావంతులు లేదా ధనవంతులు మాత్రము హీబ్రు, గ్రీకు, లేదా లాటిన్ భాషలలో చదవ గలిగేవారు.

కానీ విలియం టిండేల్ అను ఒక పండితుడు ప్రతిఒక్కరికీ వాక్యము అందుబాటులో ఉండాలని తలంచెను. ఈ కారణముగా ఆయన తన స్వంత భాషలోకి : అనగా ఆంగ్ల భాషలోకి తర్జుమా చెయడాన్ని మొదలు పెట్టాడు.

ఎంతో మంది అధికారులు ఆ తర్జుమాని వ్యతిరేకించారు మరియు టిండేల్ యొక్క ఉద్దేశాలకు ఎదురు నిలిచారు, ఆ కారణముగా ఇంగ్లాండు నుండి వెళ్ళి తరువాత కొంతకాలానికి అక్రమ రవాణా ద్వారా క్రొత్త నిభంధనను తన స్వదేశానికి తిరిగి తెప్పించాడు. తొమ్మిది సంవత్సరాలు, టిండేల్ నిర్బంధాన్ని తప్పించుకొని తన కార్యాన్ని కొనసాగించి మొదటి ఆంగ్ల బైబిల్ తర్జుమా చేసాడు. కానీ తుదకు, ఆయన పట్టబడి, మతభ్రష్టత అని నిషేధించబడి, మరియు గుంజకు కట్టి కాల్చబడ్డాడు.

కానీ దేవుడు ఏ కార్యము నందైన భాగస్వామి అయితే - ఆయనను ఆపతరము దేని వల్ల సాధ్య పడదు.

టిండేల్ యొక్క త్యాగము రహస్య ఉద్యమానికి నాంది పలికింది. దాదాపు 100 సంవత్సరాల తరువాత, మార్పు జరిగింది. ది King James బైబిల్ ఆంగ్లంలో అందుబాటులోకి వచ్చింది - టిండేల్ యొక్క తర్జుమా పనిని ఎంతో ఉపయోగించి మొదట ఆవిష్కరించబడినది.

కాలగమనములో, ఇంగ్లాండు బైబిల్ ద్వారా రూపాంతరము పొందినది. పునరుజ్జీవనం మరియు మేల్కొల్పు కలిగింది, మిషెనరి ఉద్యమం ఆవిర్భవంచింది, మరియూ బైబిల్ తర్జుమా చేసే ప్రత్యేక కార్యాలయాలు రూపొందాయి. వాక్యము ఒక దేశములో పునర్జీవనము తేగలిగింది- కానీ ఉజ్జీవము ఆంగ్ల తర్జుమాకారులు ప్రతిఒక్కరికీ దేవుని వాక్యము అందుబాటులో ఉండాలని ... మరియు వారు దీనికొరకు పనిచేయ పూనుకొనుట ద్వారా మొదలైంది.

మొదటి తర్జుమాకారుల యొక్క ధైర్యము మిమ్మల్ని ఎట్లు ప్రేరేపించింది?

ఈ క్షణం, టిండేల్ వెళ్ళిన కఠిన పరిస్థుతులని పునరాలోచన చేసుకొండి, పిమ్మట వాక్యమును మీ చుట్టూ ఉన్నవారికి ఎలా పంచుకొన గలరో దేవుని వద్ద విచారించి తెలుసుకోండి. ఒకవేళ ఒక వాక్యము ఎవారికైనా పంపడము, లేదా మరి బైబిల్ తర్జుమా చేయు యోచనకు సహాయపడటం.

ఏది ఏమైనప్పటికీ, మీకు దేవుని వాక్యము లభింకపోతే మీ జీవితం ఎంత భిన్నంగా ఉండునో ఒక్కసారి ఆలోచించండి , ఆ తర్వాత మరొకరి జీవితంలో మార్పుకు ఉత్ప్రేరకంగా ఉ౦డ౦డి.

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

La Biblia está viva

ఆది నుండి కూడా దేవుని వాక్యము హృదయాలను మరియు మనసులను పునరుద్ధరిస్తు ఉంది కానీ ఇంకా దేవుని కార్యము పూర్తి కాలేదు. ఈ 7 రోజుల ప్రత్యేక ప్రణాళికలో, ప్రపంచ వ్యాప్తంగా చరిత్రను తిరగ రాయడానికి మరియు జీవితాలను మార్చడానికి దేవుడు బైబిలును ఎలా వాడుకుంటున్నాడో కొంచెం లోతుగా చూస్తూ, లేఖనాలుకు ఉన్నటువంటి జీవితాన్ని మార్చే శక్తిని కొనియాడెదము.

More

ఈ బైబిల్ ప్రణాళికను రూపొందించి మీకందించిన వారు YouVersion.